నేను లిరిక్స్ వ్రాసింది చాలా తక్కువే .. ఎందుకో అటువైపు వెళ్లాలనిపించదు .. కారణం ఒక్కటే అయివుండొచ్చు.. ఆ లిరిక్స్ కి స్వరాలు కూర్చితేనే అవి అందంగా తయారవుతాయి.. ఆ స్వరాలు కూర్చడం అనేది ఓ అందని ద్రాక్షే.. అందుకే ఈ కవితలతో, కావ్యాలతోనే సరిపెట్టేసుకున్నాను.. వీటికి స్వర మాధుర్యం అక్కర్లేదు.. సహజంగానే సౌందర్యంగా ఉంటాయి.. అందుకే ఇవి అంటే కాస్త మక్కువ ఎక్కువ.. కానీ అప్పుడప్పుడు వాటినీ ఓ పట్టు పడుతూ ఉంటాను... అలా ఓ షార్ట్ ఫిల్మ్ కి అని వ్రాసిన ఓ రొమాంటిక్ లిరిక్సే ఇది.. ఒకరి కోరిక మేరకు వ్రాయాల్సి వచ్చింది.. ఇప్పుడు వారే అందుబాటులో లేరు... అందుకే వారి జ్ఞాపకంగా, వారు మళ్ళి తిరిగి రావాలని వారిని గుర్తు చేసుకుంటూ ఇది పోస్ట్ చేస్తున్నాను..
చిరకాల బంధీనేనే నీ కౌగిళ్ళలో..
అవిరామ శ్రామికుడనే నీ సౌఖ్యములో..
నా కలల ఇంద్ర ధనుస్సుల మీంచి
నడిచిరా ఆంగికాభినయంతో నా అర్ధాంగివై ..!!
విరబోసుకున్న నీ కురుల మధ్యన
నా లే .. లేత కోరిక వ్రేళ్ళాడు సమయాన..
పురివిప్పిన మయూరము నువ్వై
పరితపించే పరిణేతుడు నేనై ..
నీ పెదవిపై పూచిన నవ్వుల పువ్వులలో..
ఒదిగి నలిగి పోమా... !!
!! చిరకాల బంధీనేనే నీ కౌగిళ్ళలో!!
పసిడి మోము శోభణివై
ఏడేడు జన్మల బంధానివై
మూడు ముళ్ళ దాంపత్యముతో
ముచ్చటైన మల్లెల పర్యంకముపై
సృష్టి కార్యానికి సన్నద్దమవుదాం..
పాతికేళ్ళ పరువానికి పరదాలు తొలగిద్దాం.. !!
!! చిరకాల బంధీనేనే నీ కౌగిళ్ళలో!!
గాండీవమంటి నడుమును చుట్టి..
కన్నె సొగసులను శరముగా పట్టి..
సంధిస్తున్నా ఉద్రేకామామృతములను
వేణువై, విపంచివై, నాదమువై, నిస్వనమై
నన్నేలవే నా భావ గీతికవై..
నా హృదయ కోవెల కన్నికవై .. !!
!! చిరకాల బంధీనేనే నీ కౌగిళ్ళలో!!
వెచ్చని కౌగిళ్ళ మధురిమల నడుమన
సరస సయ్యాటల సమర ఖేళిలో
రసోద్బవ సరస మధురిమల పరిష్వంగములలో...
తుంటరి నిట్టూర్పుల తో..
ఇరువురి ఓటమిని ఒప్పుకుంటూ..
స్వేదములతో తడిచిపోమా..
శ్వాసలతో ఏకమై పోమా.. !!
Written by : Bobby Nani
dear sir very good blog and very good content
ReplyDeleteCelebrities News