ప్రతీ ఒక్కరు పురుషుని భావాలతోనే ఎక్కువశాతం కవితలు వ్రాస్తున్నారు..స్త్రీ లు కూడా పురుషుని స్థానంలో వుండి వ్రాసేస్తున్నారు... రాయలేక ఇలా వ్రాస్తున్నారని నేను అనుకోవట్లేదు.. ఎందుకంటె పరస్పరమైన పురుషుని భావాలనే అవలీలగా వ్రాస్తున్న వీరు తమ స్వంత భావాలను వ్రాయలేరని నేను అనుకోవట్లేదు.. అయిననూ ఇలా ఎందుకు వ్రాస్తున్నారబ్బా అనే ఆలోచన లేకపోలేదు.. బహుశా మగవాని భావాలను బహిర్గతం చేసినట్లు వారి భావాలను చెయ్యడానికి ఆడతనం అడ్డు వస్తుందేమో అనే సందేహమూ లేకపోలేదు.. ఏది ఏమైనా స్త్రీ భావాల రూపంలో ఓ కవిత వ్రాయాలని సంకల్పించాను.. అదే ఈ ఆత్మ సఖుడు..
ఆత్మ సఖుడు..
***********
గాండీవం లాంటి
నీ బాహువుల్లో
శరంలా బిగించావు నన్ను..
విడువకురా..
ప్రణయ లోకాలు బ్రద్దలైపోతాయి.. !!!
పూర్ణబింబంలా ముడిచిన
నీ అధరములతో
శంఖంలా పట్టి నను పూరిస్తున్నావు..
వదలకురా..
సృష్టి అంతా శూన్యమైపోతుంది..!!
నీ నఖ విన్యాస విలాస క్రీడలో
నక్షత్రాలు మొలుస్తున్నాయి
నా ఆర్జవ శరీర క్షేత్రంలో
ఆపకు రా ప్రియా..
అంధకారం అలముకుంటుంది..!!
నా స్వప్నాల పూల డోలికలో
సత్యమై ఊగుతున్నావు
విశ్రమించకు రా సఖా...
కాలగతి ఆగిపోతుంది.. !!¬
శ్వేత శిఖరములవంటి
నా యవ్వన హృదయ సౌందర్యములో
పసి బాలునివలె ఒదుగుతున్నావు
రసజగద్రహస్యాల రవిక ముడులువిప్పుతూ..
రా... త్వరపడరా ...
పంచ ప్రాణాలు, పచ్చి ప్రాయాలైపోతున్నాయి.. !!!
ఏమైనా చెయ్యరా..
కాని,
నీ ప్రఘాడ ప్రేమాభివ్యక్తిగా చేసుకో..
నీ ఇష్ట కామ్యసిద్ధి శక్తిగా చూసుకో..
ఆత్మ సఖా..
పరవశించిన నా దేహంలోని
పంచ ప్రాణాలు నీవేరా...
అందుకోరా..
నా ఆత్మ సఖా.. !!!
Written by : Bobby Nani
అందరికి నమస్కారములు..
ReplyDeleteఅనుకున్న ఉద్యోగము రాక, వ్యవసాయములో నష్టము వచ్చి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న రూపిరెడ్డి ప్రదీప్ రెడ్డి ఫ్యామిలీని ఆదుకోడానికి మేము ఈ నిధుల సేకరణ మొదలు పెట్టాము. దయచేసి మీరు అందరూ మీ బంధువులు స్నేహితులతో షేర్ చేసుకోండి. దాతలు ఎవ్వరైనా సహాయం చెయ్యగలరు. ప్రదీప్ రెడ్డి కి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వారి బాధ్యతలు మేమె చూసుకోవాల్సి ఉంది.
మేము అతని ఇన్సురెన్సులు మరియు అకౌంట్లు అన్ని ప్రయత్నాలు చేసాము. కానీ ఆత్మహత్య మరియు పేమెంట్స్ చెయ్యకపోవడము , ల్యాప్స్ కావడము వలన ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇంకా మేము వివిధ ప్రభుత్వ పథకాలకు కూడా అప్లై చేస్తున్నాము.
ఎవ్వరైనా డైరెక్ట్ గా బ్యాంకు అకౌంట్ కి పంపాలనుకుంటే ఈ ఐసీఐసీఐ అకౌంట్ కి పంపగలరు. ప్రతి చిన్న సహాయమైన మాకు పెద్ద సహాయం. ఈ లింక్ లో అన్ని వివరాలు ఉన్నవి.
కవిత పి
061801505070
సేవింగ్స్ అకౌంట్
ifsc : icic0000618
దయచేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసి ఆదుకోగలరు.
https://www.impactguru.com/fundraiser/help-pradip-family-who-sucide