\\\\హృదయాలయం ////
*****************
వెయ్యి ఏనుగులు
ఒక్కసారి ఘీంకరించినట్లు,
వెయ్యి జలపాతాలు
ఒక్క పెట్టున మ్రోగినట్లు,
కోటి ఉరుములు,
కోటి మెరుపులు,
బుద్దిని బద్దలు చేస్తున్నాయి..!!
గుండెను పుండును కావిస్తున్నాయి..!!
వంద నందనవనాలు
ఒక్కసారి పుష్పించినట్లు..
వేల విద్యుద్దీపాలు
ఒకేసారి వెలిగినట్లు..
తనువంతా పరిమళం,
తలంతా కాంతులు,
ఊపిరి సలపనివ్వటం లేదు..!!
చూపు ఆననివ్వటం లేదు..!!
నరాల తీగల్లో,
నాకు తెలియని తంతివార్తలు..
గుండె కోనలో,
అవ్యక్త మధుర సంగీత ధ్వనులు..
కను కొలుకుల్లో,
కనిపించని వర్ణ చిత్రాలు..
అరలు తొలగి పొరలు తొలగి,
కలల్లోని కమ్మని బొమ్మలు,
వెన్నెముక నిచ్చెన మీద,
మంచులాంటి చేతులూ..
వెన్నలాంటి పాదాలూ..
తాకుతున్న, దూకుతున్న, జాడలు నీడలు..
హృదయ రక్తనది వంతెన మీద,
పూల అడుగుల నడకలు..!!
పరుగుల సవ్వడులు.. !!
తీయని మర మేకులు,
కమ్మని రంపాలు,
హాయి అయిన సమ్మెటలు,
గుండెను తొలుస్తున్నాయి...!!
కోస్తున్నాయి..!!
కొడుతున్నాయి..!!
మధుర వేదనలు,
మనస్సు పూల చెట్టును,
మరీ మరీ విదిలిస్తున్నాయి..!!
కదిలిస్తున్నాయి..!!
ఆనందస్రోతస్విని అంచున
అమృతం కురిపిస్తున్నాయి..!!
ప్రవహిస్తున్నాయి..!!
కళ్ళు మూసుకుంటే,
కనిపించే సుందర దృశ్యాలు,
కనురెప్పల తలుపులు తీస్తే,
కదిలిపోతున్న వెన్నెల వాగులు,
నా శరీరం వీణను,
నా మనస్సు మీటను,
నా నరాల తీగలను,
కదిలించి కుదిలించి,
నా హృదయాన్ని పలికించే,
ఈ అమాయికపు అల్లరిమూక,
నా ప్రాణానికి వెన్నెలవాక..!!
ఈ వినిపించని సంగీతం,
ఈ కనిపించని సాహిత్యం,
ఏ నాటికో వినిపిస్తుంది..!!
కనిపిస్తుంది..!!
ఆ నాడు,
నన్నాడించిన, ఉడికించిన,
పలికించిన, రాయించిన,
ఈ అమాయికపు అల్లరిమూక,
నా గుండెకు ప్రతినిధిగా,
నా హృదయానికి ఆలయంగా,
నాకు శాశ్వతత్వం ప్రసాదిస్తుంది..!!
అంతవరకు ఇలా..
నేనిలా..!!
Written by : Bobby Nani
for SELF EMPLOYMENT/HOME BUSINESS www.indiaonlines.in *** www.4job.in
ReplyDeleteఆయుధ పూజా విధానము :
ReplyDeleteశ్రీ శ్రీ శ్రీ బ్రాహ్మణోత్తమ కవి కష్టేఫలి బ్లాగర్ శర్మ అన్నపూర్ణాదేవికి భక్తితో ఒక బ్లాగునందు పరమాన్నము నివేదించి, తన మరో బ్లాగులో రచించిన శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రం అవధరింపుడు.
ఓక అమ్మని లంజా అంటే,మరొక అమ్మ నీ అమ్మ లంజా, నీ అమ్మమ్మ లంజా, నీ నానమ్మ లంజా అని అన్నదట !
దీనిని భక్తితో 108 పర్యాయములు పఠించినంతనే నిర్గుణోపాశ స్థితి కలుగునని తద్ బ్రాహ్మణుడు నుడివినాడు కనుక మీ బ్లాగునందు ప్రచురించుకుని ఆనందముతో తరింపుడు.