Monday, April 3, 2017

“చితి” కి పోతున్న చిన్నారులు ..



“చితి” కి పోతున్న చిన్నారులు .. 
************************


కుప్పం లో జరిగిన ఓ ఘటన నన్ను శోకసముద్రంలో ముంచి వేసింది.. 

అదో బడా కార్పొరేట్ స్కూల్ .. బలసిన వాళ్ళ దగ్గరనుంచి, బలహీనుల వరకు ఏ ఒక్కరిని కనికరమే లేకుండా ఫీజుల రూపంలో నడ్డి విరిచి రక్తాన్ని జుర్రుకుంటున్న ఓ సంస్థ.. 


యెంత కష్టమైన భరిస్తాం, మా పిల్లలకు మాత్రం రక్షణతో కూడిన విద్యను అందివ్వాలన్న తపనతో, పురిటిపిల్లలపై కన్ను, మిన్ను తెలియక పైశాచికంగా అత్యాచారాలు చేసే మానవ మృగాలు ఉన్న నేటి సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ స్త్రీ లే ఉన్నటువంటి ఆ స్కూల్ లో తమ 3 ఏళ్ళ పాపను చేర్పించారు.. కొన్ని రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బుడి బుడి నడకలతో బడికి వెళ్లి వస్తూ వున్న ఆ చిన్నారిపై అక్కడ గేటు దగ్గర కాపలాదారులు ఇద్దరు మగవారు కన్నేశారు.. సమయం చూసి స్కూల్ ఆవరణంలో ఉన్న వారి విశ్రాంతి గృహానికి తీసుకుపోయి అతి దారుణంగా ఆ పాపను అత్యాచారం చేసారు.. 


ప్రస్తుతం ఆ పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది .. ఈ వార్త విన్న దగ్గరనుంచి ఏంటో కళ్ళల్లో నీరు ఆగటంలేదు.. మనసు మనసులో లేదు.. 

మనుషులేనా వీరు అసలు.. 

ముక్కుపచ్చలారని మూడేళ్ళ పాప లో వీరికి అంతటి కామం ఏం కనిపించింది ... ఛ ఇలాంటి సమాజంలోనా మనం బ్రతుకుతున్నది.. 

నేటి సమాజంలో నవసంబంధాలు మానవీయవిలువలను కోల్పోయి మార్కెట్ విలువలు ప్రతిష్టింపబడుతున్నాయి. కావలసినది పొందటం, ఎటువంటి దానికోసం అయినా, ఎంతటి నీచానికైనా దిగజారటం..... భౌతిక సుఖాలను పొందటమే పరమలక్ష్యం గా సాగుతున్న ఈ చదువుల ఫలితాలు నేడు ఆధునిక అలంకారాలుగాను, ఊరకుక్కల్లా కన్నేసిన ప్రతీవారిని చిన్నా, పెద్దా, వావి, వరస అనే తేడాలు లేకుండా అనుభవించే పాశ్చాత్య సంస్కృతిని, స్వేఛ్ఛాజీవనానికి సంకేతంగానూ మార్చివేశాయి.... 

ఎనిమిదేళ్ళ వయస్సులో పక్కనింటి అంకుల్ గట్టిగా బుగ్గ గిల్లాడని తల్లికి చెప్పలేకపోయింది ఓ పసితనం .. తల్లి కోప్పడుతుందని.. 

బడిలో ఓ కామ పంతుల వెకిలి చేష్టల్ని మనసులోనే అణిచివేసింది ఆ ఆడతనం.. ఇంట్లో తెలిస్తే చదువుకు ఇక సెలవంటారని ... 

బజారులోని దుకాణం దారుడు, 

రోజు వెళ్ళే బస్సులోని కండెక్టర్, 

ఇంటి సందు చివరన కుర్రకారు గుంపు, 

ట్యూషన్ మాస్టారు కొడుకు... ఇలా ఎన్నో ఎన్నెన్నో వేదింపులు.. 

అన్నీ అవమానాలను దిగమింగుకొని కన్నిటితోనే కలిసికట్టుగా జీవిస్తోంది.. 

ఈవ్ టీజింగ్ ని మునిపంట నొక్కి, ర్యాగింగ్ లకు దాసోహం చేసి, 

అగ్నిగుండాల వంటి ఎన్నో సంద్రాలను దాటుకొస్తుంది ఆ ఆడతనం ...

ఉద్యోగంలో పై అధికారి దుర్భుద్ది బయటపెడితే గుట్టుగా మందలించింది... వింటే ఎవరైనా తనమీద నిందమోపుతారేమో అని భయపడి.. 

చివరికి భర్త క్రూరత్వాన్ని, కర్కశత్వాన్ని భరించడంలో తానింకా భూదేవి పాత్రనే ధరిస్తూ వుంది...

ఇలా పురిటిపిల్ల దగ్గరనుంచి పీనుగయ్యే వరకు ఒకటా, రెండా ఎన్ని అడ్డంకులను దాటుకు వస్తుందో.. 

కామేంద్రుల వెకిలి వికటాట్ట హాసాల విరుపులలో తను ఒక తునిగిన తునక.. అదే ఆనందమని, విజయమని, స్వంతమని, ఆక్రమించామని, బలవంతంగా అందుకున్నామని ఆ కామేంద్రులు విర్రవీగితే... వారి వెనకనున్నది కూడా మరో స్త్రీ నల్లని నీడ మాత్రమే...!!!!

ఇలాంటి వారికి భయం ...!!

భయం...!!

భయం... కావాలి ...

తప్పు చెయ్యాలనే ఆలోచన రావడానికే వణుకుపుట్టేంత భయం కావాలి. ... 

నిర్ధాక్షిణ్యంగా తప్పుడుపనులకు తెగబడెవారి తలలు నేలకు రాల్చాలి....

మానభంగం చేసినవాడికి మర్మాంగాలను కోసివేయడం....

దొంగతనం చేసినవాడికి వేళ్ళు తెగనరకడం....

ప్రజలను దోచుకున్నవాడికి బహిరంగంగా శిరచ్చేదన చేయడం ....

కంటికి కన్ను, చెయ్యికి చెయ్యి, అంగాని అంగం దేనితో ఏ తప్పుకు పాల్పడ్డా దాన్ని బహిరంగంగా కత్తిరించాలి.. ఇలా ఉండాలి శిక్షలు అంటే.. ఒకప్పటి మన శిక్షలు ఇవే... కాని మనమే వాటిని ప్రజాస్వామ్య దేశం అంటూ మరిచిపోయాం... ప్రక్క దేశాలవారు ఇలానే చేస్తున్నారు..... అందుకే అన్యాయాలపై వారి శాతం స్వల్పం ..... మన శాతం అమితం ... 

ఎంతత్వరగా ఈ చట్టాలు రావాలంటే. మరో చిన్నారి, మరో చెల్లి, తల్లి బ్రతుకులు అన్యాయం కాకుండా ముందుగానే కావాలి, రావాలి ...మన రాజ్యాంగంలో ప్రస్తుత పరిస్థితుల రీత్యా చాలా సవరణలే చేసారు ... కాని అవి చాలవు, ఇంకా ఖటినతరం చెయ్యాలి... ఉదయం పేపర్ చూసింది మొదలు రాత్రి వార్తలు విన్న వరకు ఏదో ఒక మూల ఎక్కడో ఒకదగ్గర పలానా మృగం ఇలా చేసింది అనే రాతలు చూసి తట్టుకోలేకున్నాం... 

__/\__


Written by : Bobby

No comments:

Post a Comment