Wednesday, March 29, 2017

మిత్రులందరికీ “హేవిళంబి” నామ సంవత్సర “ఉగాది” శుభాకాంక్షలు...


మిత్రులందరికీ “హేవిళంబి” నామ సంవత్సర “ఉగాది” శుభాకాంక్షలు... 

"'చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పధమే అహని,,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తధై వచ'"

అనగా బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువు లో మొదటి మాసం ( చైత్ర మాసం) లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం..... 

అందుకే మొదటి సంవత్సరానికి "ప్రభవ" అని పేరు...... చివరి అరవైయ్యొవ సంవత్సరం పేరు "క్షయ" అనగా నాశనం అని అర్ధం. కల్పాంతం లో సృష్టి నాశనమయ్యేది కూడ "క్షయ" సంవత్సరంలోనే. అందుచేతనే చైత్రమాసం లో శుక్లపక్షం లో సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజును యుగాది అదే ఉగాదిగా నిర్ణయించబడింది.... ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. ...షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక..... జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది..... పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -

బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

చక్కని మావి చిగురుటాకు పచ్చదనం... 
కోయిలమ్మ కమ్మని కూత.. 
ఇంటింటా శోభాయమానమైన పచ్చని తోరణం.. 
ముంగిలిలో వెలసిన ముగ్గుల వెల్లి.. 
మమతను పంచే మనసుల కొలువై . . , 
మనకై విచ్చేసెను ఉగాది మళ్ళీ . . . ! 
షడ్రుచుల సంగమమై.. సాగిపోవుమా...
జనులలో వెల్లివిరిసిన ఆనందాల హోలాహలం.. 
ఓ హేవిళంబి .. 
ఉత్పత్తిని పెంపు జేయుఁగ.. 
జనులందరినీ చల్లగ చూడంగ.. 
ఖడ్గమున్ ధరించి ....
పలు దుష్టుల, త్రాష్టుల పాలి శత్రువై...
చర్మము లూడదీసి.... తగు శాస్తిని జేయుచు...
సంఘమందునన్...
ధాత్రిని శాంతిని నింపుమమ్మ! ఓ
హేవిళంబి నామ వత్సరమా... ! సంవత్సరమా... 
తోషము గూర్చుమా .. మా మానవాళికిన్..!

స్వస్తి ___/\___

No comments:

Post a Comment