Tuesday, March 21, 2017

ఎందుకురా నీ చదువులు...??




ఎందుకురా నీ చదువులు...??

సోదరత్వాన్ని పెంచలేని చదువులు..
మానవత్వాన్ని నేర్పని చదువులు.. 
మంచితనాన్ని పోషించని చదువులు..
మమతలు పరిమళించని చదువులు.. 
ఎందుకూ కొరగాని నీ చదువులెందుకురా ..!!

పుస్తకాలలో ముఖాలు దాచి..
మస్తిష్కాలలో పుస్తకాలను నిలిపి..
ప్రతీక్షణం చదివి చదివి, బట్టీ పట్టీ 
విసిగిపోయిన విద్యార్ధుల 
కాంక్షలు ఫలించని ఈ సమాజంలో 
అర్హతకు చోటే లేదు.. !!

అర్ధానికి విలువనిచ్చే ఈ కాలంలో 
అన్యాయమంటే వినేవాడే కరువయ్యాడు
అక్షరాస్యునికి నిరక్షరాస్యునికి 
అసలే తారతమ్యం లేదు..
తెలియక తప్పుచేసే అమాయకుడు నిరక్షరాస్యుడు.. 
తెలిసి తప్పు చేసే మేధావి అక్షరాస్యుడు..

ఒక్కసారి చూడు..
చదివినవాళ్ళే తప్పు చేస్తున్నారు నేడు..
పుస్తకాల చదువులు జీవితాలకు పనికిరావనే 
సత్యాలు గ్రహించే సమయాలు దాటిపోతున్నా.. 
జీవితపు చదువు చదవలేకపోతున్నాం..

తమ్ముడు .. ! 
నువ్వైనా నేర్చుకో.. !!

అమ్మడు .. !
నువ్వైనా తెలుసుకో.. !!

ఈ చదువును మించిన చదువున్నదని 
ఈ చదువులేకున్నా సరే.. 
ఆ చదువు మాత్రం మరువకు.. 
ముద్దు ముద్దుగా కాలానికి అనుగుణంగా 
జీవితాన్ని తీర్చిదిద్దే చదువు నేర్చుకో.. 
సౌశీల్యం, వినయ విధేయతలు 
చాలా ముఖ్యమని తెలుసుకో.. 
మమతలను మరిచిపోకు.. 
కలతలను రేపకు.. !!

Written by : Bobby Nani

2 comments:



  1. ఎందుకురా నీ చదువులు ?
    డెందము లలరెడి సమయము రేసుల బోయెన్
    గంధము లేనటి పుష్పము
    చందంబాయెను బతుకులు చదువుల ఘాటున్ !

    జిలేబి

    ReplyDelete