Friday, February 3, 2017

మన భారతదేశం..




మన భారతదేశం.. సుదీర్ఘ చరిత్ర,ను, విలక్షణ భౌగోళిక స్వరూపాన్ని, విభిన్నమైన జనాభాను మరియు వేషధారణలు, సంప్రదాయాలు, సింధూలోయ నాగరికత సమయంలో ఏర్పడి వేద యుగాల సందర్భంగా అభివృద్ధి చెందిన పురాతన వారసత్వాలు, కొన్ని పొరుగుదేశాల నుంచి స్వీకరించిన భావాలు, బౌద్ధ మత ఉన్నతి, పతనం, స్వర్ణ యుగం, గొప్ప భిన్నత్వం కలిగివున్న భారతదేశ మతాచారాలు, భాషలు, వేషధారణలు మరియు సంప్రదాయాలు, భారత్ లో ముస్లింల ప్రవేశం మరియు ఐరోపా కాలనీల ఏర్పాటులచే భారతదేశ సంస్కృతి ఇలా గడచిన ఐదు వేల సంవత్సరాలుగా ఇక్కడ నిరుపమాన సహజీవనానికి ఆనవాళ్ళుగా ఉన్నాయి. ఈ సమ్మేళనాల ద్వారా సృష్టించబడిన భారతదేశంలోని వివిధ మతాలు మరియు సంప్రదాయాలు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలను కూడా ప్రభావితం చేశాయి...... అంతే కాదు ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విజ్ఞానానికి, అత్యున్నత సంస్కృతులకు, సంస్కారానికి, ప్రేమకి, దయకి, కరుణకి, అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ కుటుంబ విలువలకు పుట్టినిల్లయిన దేశము మనది.. ఇందుకు చాలా గర్వంగా వుంది.. 

ఇదంతా ఎందుకు అంటే ?? 

మీకు తెలుసా ?? 

మనం మన భారతదేశంలో ఏ మూలాన ఉన్నా సరే .. మనకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఓ దేవాలయం కాని, మందిరం కాని తప్పక ఉంటాయని సర్వేలో తేలింది.. 

మానసిక ఉల్లాసాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని, దేహ తేజస్సుని, మనోబలాన్ని, ఆలోచనా శక్తి సామర్ధ్యాలను, భగవంతుని సేవా తత్వమును, కృపా, కటాక్షాలను మనకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళాలని వెంపర్లాడుతూ వున్నాం.. 

ఆనందం అంటే పైకి పళ్ళు ఇకిలించే ఆనందం కాదు.. అంతరింద్రియం లోలోపల నుంచి ప్రకాశించే ఆనందం .. అది ఎక్కడ వుంటుందో తెలుసా.. ?? 

టంగ్, టంగ్ మంటూ కోవెల నుంచి వస్తున్న హిందూ సోదరుల పవిత్ర ఓం కార శబ్దంలో ఉంటుంది.. 

కన్నీటితో ప్రభువును ప్రార్దించే క్రైస్తవ సోదరుల పెదవులపై ఉంటుంది .. 

చేతులెత్తి తమ హృదయ భావాలను తెలిపే ముస్లిం సోదరుల నమాజ్ లో ఉంటుంది ...

ఇది తెలుసుకోలేకపోవడం మన తప్పిదమే.. 

ముందు మీరెంటో తెలుసుకోండి .. 

నిజమైన ఆనందం అంటే ఏంటో తెలుసుకోండి.. 

అది ఎక్కడ ఉందో గ్రహించండి.. 

దాన్ని సాధించే ప్రయత్నం చెయ్యండి.. 

అప్పుడు మీ చిరునవ్వు ఎన్నటికీ మీనుండి వీడదు ... 


స్వస్తి __/\__

No comments:

Post a Comment