నా లోని భావావేశాలు ...
***************
(భావాలు అంటే అన్నీ అండోయ్.. అందుకే మొదట కవీ హృదయం, తరువాత మానవ హృదయం.. చిన్నబుచ్చుకోకుండా మొత్తం చదవండే .. )
ఒక కాలిమువ్వ కదిలి నర్తిస్తే,
కవితా ప్రవాహం గల గలా కదిలిపోతుంది..
ఒక మురళీస్వరం మధురంగా మ్రోగితే,
హృదయ తంత్రులు కదిలి ఆలపిస్తాయి..
ఒక చిరునవ్వు పసిపాప రువ్వితే,
మనిషి యెదలో మమత మొగ్గ లేస్తుంది..
ఒక మరుమల్లె మెల్లగా కనులు విప్పితే,
ప్రకృతి పులకించి పరిమళం నింపుతుంది..
ఒక తుమ్మెద అలవోకగా తడిమిపోతే,
తనువు పులకించి పరవశిస్తుంది ..
ఒక వెన్నెలకిరణం జాలువారి తాకితే,
అలల కిన్నెరసాని హొయలు చిలికిస్తుంది..
ఒక మేఘబాల మెండుగా వర్షిస్తే,
ధరణి ఒడిలో ధాన్యం దరహసిస్తుంది...
ఒక వసంతం జలతారులా మెరిస్తే,
పడుచు గుండెల్లో ప్రేమ పల్లవిస్తుంది..
ఒక కెరటం ఉవ్వెత్తుగా ఎగిరితే,
నింగిలోని చందమామ నిండుగా నవ్వుతుంది..
ఒక గడ్డి పువ్వు గర్వంగా విరబూస్తే,
పుడమి తల్లికి క్రొత్త అందాలను తెస్తుంది..
ఒక వానచినుకు సూటిగా జారితే,
ముత్యమై మారి నరంలో ఇముడుతుంది..
ఒక చేయి కనులతో చేయి కలిపితే,
అపూర్వ దృశ్యాలు అందంగా అందిస్తుంది..
ఒక ఉలి బండరాతిపై నృత్యం చేస్తే,
అద్బుత సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది..
ఒక సిరాచుక్క అక్షర రూపం దాలిస్తే,
ఉప్పెనలాంటి విప్లవం ఉరకలేస్తుంది..
అందుకే ఈ అక్షరాలు అంటే అంత అమిత వ్యామోహము నాకు .. ఒక సిరాచుక్క లక్ష మెదళ్ల కదలికలను నిర్ధేశించగలదు అని నమ్ముతాను నేను. ఈ విషయం పై నాకు ప్రగాఢ విశ్వాసం, నమ్మకం ఉంది..
నాది ఇంత పొడవు, అంత పొడవు అని చెప్పుకుంటూ ఆ పొడవును ప్రయోగించకుండానూ, ఉపయోగించకుండానూ బ్రతికే అపర పండితులు ఉండినా ఒక్కటే ఊడినా ఒక్కటే.. అలానే అక్షర జ్ఞానం వుండి వ్యర్ధ ఆలోచనలు చేసే పండితులకు, మా వంటి పామరులకు తేడా ఏముంది.. ? జ్ఞానం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు, ఒకడు దొంగలిస్తే దోచుకునేది కాదు..
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించి గడ గడ లాడించిన మహాకవి శ్రీశ్రీ గారు .. ఈయన ఈ స్థాయికి వస్తారని ఆయనకే తెలియదంట ... ఒక శతాబ్దాన్ని మొత్తం ఆయన రచనలతోనే ఉరకలేత్తించారు ఈ అసమాన వేత్త .. ఒకప్పుడు ఈయన కూడా సాదారణ వేత్తే ..
తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు.. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి గా ఈయన సుప్రసిద్దుడు .. ఓ సాధారణ కుటుంబం నుంచి ఓ అసాధారణ వ్యక్తిగా మారారు.. ఈయన కూడా ఒకప్పటి సాదారణ వేత్తే ..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో, ఎందరెందరో మహా కవులు .. వారితో పోలిక అని కాదు.. కాని ఆనాటి దౌర్జన్యాలకు, దోపిడీదారులకు వీరి రచనలు ప్రజల గుండెల్లో నాటుకునేవి . వశీకరణ మంత్రం లా అవి ప్రత్యర్ధులపై ప్రభావితం చేసేవి.. వారి అక్షర జ్ఞానం పదిమందికొరకు మాత్రమే ఉపయోగించారు..
మరి ఈ నాడు దోపిడీ నాయకుల కొరకు, బ్రష్టు పట్టిన సమాజం కొరకు, ఆడబిడ్డల కన్నీటి వ్యధల కొరకు, ప్రతీ సమస్య కొరకు అక్షర జ్ఞానం ఉన్నా సంధించని నిరుపయోగపు మానవ అస్త్రాలు ఎన్నో వున్నాయి... అవన్నీ వ్యర్ధాలే.. వాటిలో కొన్ని భయంతోనూ, భాద్యతారహితంగాను, స్త్రీలపై కామవాంచ తోనూ, ప్రక్కదోవ పడుతూ వున్నాయి.. ఇది శోచనీయం .. మరికొన్నేమో అంతా నేనే .. నేనే తోపు అనే బ్రమలో బ్రతికేస్తున్నాయి.. అంతా నేనే అనుకున్నప్పుడే నువ్వు యెంత జ్ఞాన వంతుడైనా చండాలుడితో సమానమని అర్ధం.. నిజమైన జ్ఞాన వంతుడు యెంత అభ్యసించినా ఇంకా నేర్చుకోవాలనే తపనతో నిత్య విద్యార్ధిగానే ఉంటాడు.. ఈ పొగడ్తలు మనల్ని లోబరుచుకొని బలహీనమైన వాడిగానూ, మన, తన, తెలియని వాడిగానూ, స్త్రీ, పురుష తారతమ్య భేదాలు వేలెత్తిచూపే వాడిగానూ, గురువు ఎదురుపడినా నా తర్వాతే ఈన అనే అహంకార స్వభావం కలిగిన వాడిగానూ ఇతను కొట్టు మిట్టాడుతూ ఉంటాడు.. రవ్వంత పొగడ్త మహా జ్ఞానిని సైతం పిచ్చోడిని చెయ్యగలదు .. అందుకే తస్మాత్ జాగ్రత్త .. విమర్శ పదిమందికి నిన్ను గొప్పగా పరిచయం చెయ్యగలదు .. ఎవరు కాదన్నా, ఔను అన్నా ఇది సత్యం.. ఈ విధంగా పిచ్చోడిగా మారిపోయిన ఎంతోమందిని కళ్ళ ముంగిటే చూసాను నేను.. అందుకే ఇది నేను నమ్ముతాను.. నమ్మడమే కాదు ఆచరిస్తాను.. కాని నేను కూడా కొన్ని సందర్భాలలో ప్రక్క దోవకు అవకాశం కల్పించినా వెంటనే నన్ను నేను మందలించుకొని ముందుకు కదుల్తున్నాను ..
Bobby.Nani
మీ అక్షరారణ్యం చాలా బాగుంది
ReplyDeleteనా సెల్ నం 9848589838
Fb niyogi ark