Tuesday, December 13, 2016

ఇంద్రధనుస్సు కరిగి, కురిసింది..

వార్ధా గర్జనకు 
ఇంద్రధనుస్సు కరిగి, కురిసింది.. 
ప్రళయతాండవం అలసి, ముగిసింది.. 
తమిళవాసుల కన్నీరు, మున్నీరుగా మారింది.. 
మహానగరం కాస్త అంధకారమైంది.. 
ఇన్నేళ్ళ అభివృద్ధి నిమిషాలలో కనుమరుగైంది... 
జన జీవనం స్థంబించి, అస్తవ్యస్తమైంది .. 
రాకాసి వాయువులకు వృక్ష ఱేడు నేలకొరిగింది .. 
కనికరమే లేని ప్రకృతి మాత విళయతాండవం చేసింది.. 

ఇది చాలా శోచనీయం...అయినా ప్రకృతిని తప్పు పట్టి ఏం ప్రయోజనం.. 
మన రక్షక బటులైన చెట్లను మనమే తుడిచేస్తున్నాం కదా.. మనకు కావాల్సిందే ఇది.. 
ఓ లైలా, 
ఓ నీలం, 
ఓ హెలెన్, 
ఓ లెహర్, 
ఓ హుదూద్, 
నేటి వార్ధా వరకు గుండెలపై తొక్కించుకున్న తెలుగు జాతి మనది.. 
ఉప్పెన వచ్చినప్పుడే కదా మన తప్పు మనకు కనపడేది.. 
అయినా ఏం లాభం.. 
కాసేపు ఆలోచిస్తాం.. 
కాసేపు బాధపడుతాం ...
కాసేపు ఏడుస్తాం ..
మరికాసేపటికి అంతా మర్చిపోతాం.. 
ఎంతైనా దులుపుకు పోయే బ్రతుకులు కదా .. మారను గాక మారవు.. 

Bobby.Nani

No comments:

Post a Comment