Saturday, December 17, 2016

The Mysterious Island...


SOCOTRA 
-The Mysterious Island- ఇది నేను రాస్తున్న మరో పుస్తకం పేరు... 
“కొన్ని సంవత్సరాలకు ముందు ..” పుస్తకం లాగానే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.. 

ఈ కథను మీకు జనవరి 1వ తేది నుంచి అందించాలని ప్రయత్నిస్తూ వున్నాను.. అందుకోసం చాలా సమయాన్ని వెచ్చిస్తున్నాను .. మరి ఎంతవరకు సాదించగలనో చూడాలి.. 

ఆ దీవి అందాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. అక్కడి అనుభూతుల్ని ఆస్వాదించడానికి సమయం చాలదు ..!! అందం ఉన్నచోటే ఆపదకూడా పొంచి వుంటుంది.. అంత అందమైన దీవిలో అడుగడుగునా ఆపదే... ఆ అపాయాలను అడ్డుకుంటూ ఓ సాహస యాత్ర ను ఉద్దేశించి, ప్రతీ భావాలను కళ్ళకు కట్టినట్లు చూపడమే నా ముఖ్య ఉద్దేశం.. ముఖ్యంగా ఈ కథలో ఓ కుటుంబం చేసే అత్యంత సాహస ప్రయాణాన్ని.. ఆ ప్రయాణంలో వారికి కలిగిన అనుభవాలను, సంభవించిన పరిణామాలను కూలంకషంగా రాస్తూ ... వారు వెళ్లాలనుకునే ఆ దీవిలోకి వెళ్లి అక్కడ జరిగే కొన్ని రహస్యాలను తెలుసుకొని అందరి మధ్యకు తెచ్చే ప్రయత్నాన్ని నేను రాస్తున్నాను... ఈ కథ లో ప్రతీ పంక్తిలో ఆసక్తి కొనసాగుతూనే వుంటుంది..... 

మొదటి నుంచి చివరి వరకు “తరువాత ఏం జరుగుతుందా ?” 
అనే ప్రశ్నను పదే పదే మీ ముందు ఉంచుతూ నరాలు తెగేంత ఉత్కంఠభరితముగా ఉంటుందని చెప్పగలను.. బుద్ధిని, తర్కాన్ని పెంచే రచనలు ఈ రోజుల్లో చాలా అరుదు.. ఎందుకంటె అందరూ ఈ మధ్య వినోదం మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు... వినోదంతోపాటు బుద్ధిని, తర్కాన్ని పెంచాలనే సంకల్పంతో ప్రతీ అక్షరాన్ని మనసుపెట్టి రాస్తున్నాను.. అందువల్ల అవి శాస్త్రీయం గా ఆలోచించేందుకు ఉపయోగపడతాయి. 

పిల్లలు సరే, హేతు బద్ధతిని కోల్పోతున్న యిప్పటి యువకులు కూడా యిలాంటివి చదివితే సమాజానికి ఎంతో కొంత మంచిదని నా ఉద్దేశం.. ఇందులో ముఖ్యంగా ఒక కొత్త సబ్జెక్టు “Cryptography”(గూడలిపి శాస్త్రం) గురించి మరియు “లా” కు సంబంధించి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలను కూలంకషంగా వివరించడం జరిగింది.. 

“Cryptography”(గూడలిపి శాస్త్రం) ఏదో రాసానంటే రాసాను అని కాకుండా ... మొదట అది నేను నేర్చుకొని రాసేసరికి కొన్ని నెలల సమయం పట్టింది.. పోయిన సంవత్సరం జనవరిలో మొదలు పెట్టిన ఈ కథ నేటికీ అసంపూర్తిగానే వుంది.. కేవలం ఒక్కపేజీ మాత్రమే “Cryptography”(గూడలిపి శాస్త్రం) ఉన్నప్పటికీ దాన్ని నేర్చుకొని రాయడానికి ఇంత సమయం పట్టేసింది.. చాలా మంది అనుకుంటూ వుంటారు .. ఈ డేంటిరా సంవత్సరం నుంచి రాస్తున్నాను అని చెప్తూనే వున్నాడు అని .. నిజానికి వాస్తవం ఇదే.. 

ఇప్పుడు కథ ముందుకు వెళ్తోంది.. ఆసక్తిని రేపుతూ, విలువలను పెంచుతూ, భావాలను స్పృశిస్తూ, ఆలోచనలను రేకేత్తుతూ ఉండేలా రాస్తున్నాను.. ఈ కథను చాలా కోణాలలో రాస్తున్నాను.. నా జీవితంలో ఇది మరో మైలురాయిగా ఉండిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ వున్నాను.. మీ సహాయ సహకారములను అర్ధించి ఈ పోస్ట్ రాస్తున్నాను.. 

రెండు రోజులు పట్టింది ఈ కవర్ ఫోటో ని డిజైన్ చెయ్యడానికి నాకు... నేను రాస్తున్నాను అని తెలపడానికే ఈ కవర్ ఫోటో పెడుతున్నాను.. మీ మాటల్లో ఈ కవర్ ఫోటో ఎలా వుందో తెలుసుకోవాలని వుంది..

స్వస్తి ___/\___

Bobby.Nani

1 comment: