కొందరు తెలుగు వారు అయివుండి పాశ్చాత్య సంస్కృతులను మా గొప్పగా సెలవిస్తున్న నేటి తరుణంలో సాహిత్యం అంటే ఏంటి అనే నేటి యువత ప్రశ్నార్ధక దౌర్భాగ్యపు భావంతో తలమునకలై వెక్కి వెక్కి రోదిస్తున్న తెలుగు తల్లి మాతృ గర్భకోశ శోకానికి చింతిస్తూ వున్న సమయంలో ... విదేశాలలో వుండి కూడా పాశ్చాత్య సంస్కృతులను అవసరానికి మాత్రమే పరిమితం చేస్తూ మన సంస్కృతీ, సంప్రదాయాలను గౌరవిస్తున్న అక్కడ ఉంటున్న కొందరు స్త్రీ మూర్తులకు, పురుష పుంగవులకు పాదాభివందనం .. అలాంటి వారిలో ఓ మిత్రురాలు విదేశాలలో వున్నా కూడా తీరికలేని సమయంతో కాలం గడుపుతున్నా కూడా రచనలు చెయ్యడం, కవితలు రాయడం ఆపలేదు... అన్నిటికీ మించి ఆ కోమలాంగి ఓ గొప్ప కళాకారిణి ... మృదు స్వభావి, సున్నిత మనస్కురాలు, మొహమాటం కొంచం ఎక్కువే.. అయినప్పటికీ ఆ స్త్రీ మూర్తి, ఆ తన్వంగి, ఆ చంద్ర వదన, ఆ వనజ నేత్రిని, ఆ వరారోహిని, సుమధ్య, సుముఖ, సురదన, సులోచన, సువదన, హంసయాన, హరినలోచని ఇలా ఎన్ని పేర్లు చెప్పినా అవి అసంపూర్ణమే ఆమెగురించి ... ఆ అద్బుత మూర్తి గీచినటువంటి ఈ చిత్రానికి మీ అక్షర మాల తొడగమని చెప్పగా ... రాస్తున్నటువంటి ఓ మధురాలంకరణ అక్షర మాలిక.. ఇంతకీ ఈ చిత్రం పేరు చెప్పలేదు కదా “వన మయూరి” ఎందుకంటె వనం లో తిరిగే మయూరం బెరుకుగా, భయంగా అటూ ఇటూ చూస్తూ అమాయకమైన మోముతో కడులాడుతూ వుంటుంది నాకు ఈ చిత్రం చూసిన వెంటనే కలిగిన మొదటి అనుభూతి అదే ...
వన మయూరి ...
*************
కోకిల రాగాలు తీసే నవ చిగురులు విరియగ
వన మయూరి పురివిప్పెను హరిత వర్ణములుగా
వసంత లక్ష్మీ హొయలు పోవ గున గున నడియాడగ
నవ శోభలు ప్రతీ హృదిలో కువకవలు తీయగ
నేత చీర అందాలతో మురిసిందీ మగువని ....
కనువిందుల సింగారపు సిగ్గుల నవ వధువు
పేరంటానికి తరలిన కిన్నెర ముత్తైదువు
పెందలాడే తలస్నానపు ముచ్చటైన చిత్తరువు
యేమని చెప్పనూ ... యెంతని వర్ణించనూ ...
వన మయూరి అద్బుత సొగసులు గిలిగింతలు పెట్టగా..
చూచె జనుల కలువ నేత్రములు ఆనంద నేత్రములై
విప్పార్చి పారవశ్యమున పరవశించగా ..
ప్రతీ హృదయమందు వన మయూరి అవతారము దాల్చగా
శుభకామన మధురోహల ప్రకృతి పులకించగా
శతపత్రములు పరుగు పరుగున ఏతెంచగా
యేమని చెప్పను.. యెంతని వర్ణించనూ
వన మయూరి అద్బుత సొగసులు గిలిగింతలు పెట్టగా...
Bobby Nani
No comments:
Post a Comment