Friday, September 16, 2016

స్నేహితుడు అంటే ?



నేటికాలంలో స్నేహం అంటే Use and Throw (వాడుట వదులుట) ఎవరి స్వలోభాలకు వారు స్నేహం అనే పదాన్ని అందవిహీనం చేసేసారు.. చేస్తున్నారు.. నిజమైన స్నేహం ఈరోజుల్లో అతి స్వల్పంగా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ వుంది.. లాభాపేక్ష లేకుండా స్వచ్చమైన మనసుతో ఒకరికి ఒకరు కలిసికట్టుగా వుండటం ఈరోజుల్లో చాలా అరుదు... అలాంటి అరుదైన స్నేహాన్ని మీరు మాత్రం వదలకండి... ఇది ఇలా వుంటే ప్రతీ అడ్డమైన భందానికి స్నేహం అనే పదాన్ని వాడటం మరింత భాదాకరమైన విషయం.. పవిత్రమైన స్నేహం అనేది ఎప్పటికీ వీడదు ... అలా మిమ్మల్ని విడిచిపోయారు అంటే మీలాంటి అద్బుతమైన వారిని వారు వదులుకుంటే వారు దూరదృష్టవంతులే అని అర్ధం.. స్నేహం గురించి యెంత చెప్పినా తక్కువే అయినప్పటికీ మరికొన్ని మాటల్లో...

స్నేహితుడు అంటే ?
మన “అవసరాలకు సమాధానం” అని అర్ధం...
ప్రేమతో విత్తి, ధన్యవాదములతో నూర్చే క్షేత్రం ఈ స్నేహం...
అతడు నీకు అండ, ఆదరణ 
ఆకలితో చేరి శాంతిని పొందుతావు కనుక ... !

స్నేహితుడు తన హృదయాన్ని విప్పి మాట్లాడినప్పుడు 
“లేదు” అనే భయం మనకు రాదు...
మాటలతో పనిలేకుండానే 
స్నేహితంలో అన్నీ కోర్కెలు ఆలోచనలు, 
మౌనంగా పంచుకుంటాం..

ఎక్కే వాడికి కిందనుండి పర్వత శిఖరం కనుపించేలాగే 
మిత్రుడిలో నీవు ప్రేమించేది 
స్పష్టంగా అతను లేనప్పుడు మాత్రమే కనిపిస్తుంది.. 
అందువల్ల అతని వియోగానికి నీవు విచారిచకు.. 
ఆత్మ లోతుల్లోకి పోవడం తప్ప ...!

స్నేహంలో మరి యే లాభాపేక్ష ఉండరాదు...
ప్రేమను కాక మరి దేన్నో కోరే స్నేహం 
స్వలాభాలకు విసిరే వల అవుతుంది.. !
నీలోని మంచిని స్నేహితుడికి అందించు... 
స్నేహం కాదు సమయాన్ని చంపడానికి

అది సమయాన్ని సజీవం చేయడానికే !
స్నేహితుడు మన అవసరాలను నింపాలి
కాని మన ఖాళీలను కాదు.. !
స్నేహపు మాధుర్యంలో నవ్వుల పువ్వులు విరియాలి 
సంతోష పరిమళాలు పంచుకోవాలి.. !!

Bobby Nani

No comments:

Post a Comment