ఓసి కోపదారి ప్రేయసీ..!!
కోపం దేనికే ??
ఇకనైనా మానవే
నా హృదయం పరితపించుచున్నదే ..!!
ఓ ప్రియా,
నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించవే
నీ బాహువులలో బంధించవే,
దంతక్షతాలతో క్షతగాత్రుడిని చేయవే
ఘనస్తనాలతో గాఢంగా మర్ధించవే
నీ కడకంటి చూపులతో తనువంతా తూట్లు చెయ్యవే
కసికసిగా మన్మథ శిక్షలు విధించవే
కాయమంతా అధర గాయాలు చేయవే..!!
నేను అర్ధం చేసుకోగలను ఇదంతా
వక్రచారి అయిన మన్మథ విజృంభణ ఫలితమేనని
ఏం చెయ్యను చెప్పు
నీ వియోగ సమయం క్షణమొక యుగంగా వుంది నాకు..
చంద్రుని చల్లని కిరణాలు ప్రళయ భానుడి చండ కిరణాలై
తాపాన్ని పుట్టిస్తున్నాయి
చల్లని మందమారుతాలు సైతం
వజ్రఘాతాలై వేధిస్తున్నాయి
పరిమళాలు వెదజల్లే పూలమాలలు వాడి
సూదుల్లా గుండెలోతుల్లో గుచ్చుతున్నాయి
మంచి గంధపు లేపనాలు కణకణలాడే
అగ్ని కణాలై ఒళ్లంతా సెగలు పుట్టిస్తున్నాయి
ఊపిరి పీల్చడం కూడా భారంగా తోస్తోంది.
నీ కోపం,
నీ విరహం,
నాకో ప్రళయమై తలపిస్తోందే ప్రణయిని..!!
ఓ ప్రియా !
నీ కనుల కాంతితో సమానమైన కలువపూలు
నీట మునిగిపోయాయి
నీ ముఖ శోభను అనుకరించే నెలరేడు
కనిపించకుండా కారుమబ్బులు క్రమ్ముకున్నాయి
నీ అందమైన మదగమనాన్ని అనుసరించే రాజ హంసలు
నిర్మలమైన మానస సరోవరానికి తరలిపోయాయి
ఇకనైనా అలకపాన్పు దిగిరావా..
నా దరి చేరవా.. లేక్షణవై,
విలక్షణ మూర్తివై,
సారంగ సింగారిణివై,
నీ అమృత పయోధరములు
అధరములకందిస్తూ రావా
బిరబిర వచ్చి నను చేరవా
రసికరాజ శిఖామణి లా..!!
Written by : Bobby Nani
అలకపాన్పెక్కడం వాళ్ళు హక్కు లెండి :). సరే, ఆ పదం నెచ్చెలి అనుండాలి, "నిచ్చెలి" కాదు.
ReplyDeleteదంతక్షతాలతో క్షతగాత్రుడిని చేయవే
ReplyDeleteఘనస్తనాలతో గాఢంగా మర్ధించవే
నీ కడకంటి చూపులతో తనువంతా తూట్లు చెయ్యవే
కసికసిగా మన్మథ శిక్షలు విధించవే
కాయమంతా అధర గాయాలు చేయవే- వామ్మో ఏమి రేంజిలో రాశావు బయ్యా. నీ కవితలు చదువుతుంటే దశగ్రీవుడిలాగా తాండవకేళి చెయ్యాలి అనిపిస్తుంది. పేగులతో వీణావాదన చేయాలనిపిస్తుంది.