ప్రకృతిలో "ప్రణయిని"
***************
చుక్కలతో ఒక్కసారి సూచింతును
నా “కన్నియ” నల్లని వాల్జడ సందులలో
మల్లియలై మొలవాలని.. !!
మెరుపు తీవియలను పిలిచి
మెల మెల్లగా యాచింతును
నా “ప్రేయసి” పెదవుల చిరు
నవ్వులుగా వెలగాలని.. !!
మబ్బులతో ఒక్కమారు
మనవి చేసుకుందును నా
“అంగన” వరాంగమున
ముంగురులై మలగాలని.. !!
మిన్ను తోటి కూడా
విన్నవించుకొందును నా
“సుందరి” నెన్నడుము లోన
శూన్యత్వము నిలపాలని.. !!
వియద్గంగ కెదురు నిల్చి
విజ్ఞాపన చేతును నా
“చెంచలనేత్ర”కు మృదు చే
లాంచలమై పోవాలని.. !!
ప్రకృతి ముందు చేతులెత్తి
ప్రార్ధింతును కడసారిగ
నా “రమణి”కి బదులుగా ఆ
కారం ధరియించాలని.. !!
Written by : Bobby Nani
No comments:
Post a Comment