Monday, October 9, 2017

పకోడీ..


చాలా రోజులకు మునుపు నా ఆత్మీయులు ఒకరు అడిగారు.. అన్నిటిపై వ్రాస్తారు కదా.. కాస్త సరదాగా ఏదైనా మంచి ఫలహారం మీద రాయొచ్చు కదా అని.. నిజానికి ఇప్పటిదాకా నాకు కూడా రాని ఆలోచన అది.. వినగానే కాస్త సంకోచించాను..
“బాబోయ్ ఫలహారం మీదనా” అని.. 
“ఓస్ ఫలహారం మీదనే గా”.. 
అంటూ నాకు నేనే సర్ది చెప్పుకుని ఇలా మీ ముందుకు వచ్చాను.. వర్షం పడుతున్నప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేది అదే.. స్నేహితులతో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునేటప్పుడు గుర్తొచ్చేది కూడా అదే.. కర కరమని పంటికింద నలగలేక నలుగుతుంటే ఆహా ఆ భావనే నోటనున్న లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది కదా.. అందుకే నా (మన)కు ఇష్టమైన ఈ “పకోడీ” ని ఎంచుకున్నాను.. చదివి అభిప్రాయాలు చెప్తారు కదూ.. 
(పకోడీ మాత్రం ఇవ్వబడదు.. ) 


పకోడీ..
***** 


ఆహా ఏమి అందును 
దీని చూచి నా డెందం 
మురిసి పోవు పరవశించు 
పరుగులు తీయు.. !!


కమ్మనైన వాసనతో నూరూరించు.. 
ముచ్చటైన రూపుతో ముద్దనిపించు.. 
వేడి, వేడి ఈ పకోడీ వెలగట్టగ లేనిది..
వేల్పులైన విందులో ఆరగించ కోరునది.. !!

తాజాగా మరలోన పట్టినట్టి శనగపిండి 
కొని తెచ్చి నీటితోడ తగు చిక్కంగ కలిపి 
సన సన్నగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు జల్లి 
కొత్తిమీర కొంతమేర.. అందులోన సమముగా వేసి ..
కాసింత కారము, ఉప్పు కలివిడిగ దట్టించి 
స్వచ్చమైన ఫ్యాట్ లెస్సు నూనెతో 
దొర దోర మంట శగపై 
బాణలి తైలములొ విడువగ
వినసొంపైన శబ్దమును పదే పదే పలికిస్తూ 
కర కర లాడెడు రీతిన వేయించిన 
దాని రుచి 
అబ్బబ్బ ఏమి రుచి..!!
ఆహ్హ హ్హా ఏమి శుచి.. !!
నోటిలోన కోటి రీతిగ 
లాలాజల ఊటలు యేఱులై కారే.. 

అందించెడు వాడు కాదు.. 
ఆరగించెడు వాడు ధన్యుడు..
వాడే ధన్యుడు.. !!

ఒక ప్లేటా, 
రెండు ప్లేట్లా.. 
ఎన్నైనా గుటకవేయక 
గప్చిప్గా మ్రింగవచ్చు.. 
అది ఆరగించు వాడి భావన 
ఉంటుంది నూటికి నూరుపాళ్ళు 
స్వర్గానికి సులభ నిచ్చెన.. 
ఊహల సామ్రాజ్యాన్ని ఎలుదురూ 
మ్రింగునంత సేపూ.. !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment