Saturday, October 7, 2017

//// ఓ మనసమా..!! \\\\



మనసుకు వున్న వేగం మాటల్లో భాషించలేనిది .. క్షణాల్లో అనుకున్న ప్రదేశానికి చేరిపోతుంది.. దూరాన వున్న ఆత్మీయులను దర్శిస్తుంది... ఇదంతా మనిషికి మాత్రమే వున్న ఓ అద్బుత వరం.. అలాంటి ఓ మానసము గురించి చిరు అక్షర జల్లులు.. 


//// ఓ మనసమా..!! \\\\
******************


విహరిస్తావు విహంగాలతో 
ఆకాశాన అంచెలంచెలుగానున్న తారల వెంట 
తారాడుతావు, పోరాడుతావు ,
తళుకు, తళుకునా, 
మెరిసిపోతానంటావు 
చక్కని చంద్రుని చలువను పంచుకుంటావు 
పైకెగసి ఘనఘనాలలో నుంచి ఘనీభవిస్తావు 
స్పర్శిస్తా ..!!
వర్షిస్తా ..!!
హర్షిస్తానంటావు ..!!
నింగీ,
నేల,
అంతా నాదే, 
దిక్కులన్నీ ఒక్కటి చేస్తానని,
తిరుగాడుతుంటావు, 
పరిగెడుతుంటావు, 
క్షణంలో స్వర్గలోకం చూచి వస్తావు...
నాకలోక సుఖాలకూ భ్రమించీ, 
తమించీ, రమించీ, వ్రాలిపోతావు – తేలిపోతావు 
నీ గమనవేగం, 
మానవ నిర్మితమైన ఏ వాహనముకూ లేదు.. 
ఇంతెందుకు ??
నీ వేగం వాయువునకు కూడా లేదు.. 
ఎండ, వాన, చలి, నీకు తగలవు... అగ్ని నిను అంటదు.. 
ఉరుములు, 
మెరుపులు, 
పిడుగులు నిన్నాపవు..!!
మంత్రివౌతావు, 
రాజువౌతావు, 
చక్రవర్తివౌతావు,
సర్వస్వమును శాసిస్తానంటావు – పోషిస్తానంటావు. 
ఓ మనసమా..!!
నీలో 
ఎన్ని ఆశలో, 
ఎన్ని ఊసులో, 
ఎన్ని హంగులో, 
ఎన్ని పొంగులో, 
కనిపెడతావు కన్నులతో 
నా ప్రమేయం లేకుండానే..
నిన్నాపడం నా తరమా.. 
ఊ ...హు.. !!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment