వేదనా అశ్రువులు ఈ మధ్య
పదే పదే నా కన్నుల్ని అలంకరిస్తున్నాయి..!!
నా శరీరాన్ని వ్యధా స్వరఝురీవేగంతో
ప్రతిధ్వనింపజేస్తున్నాయి...!!
అసలెందుకీ వేదన.. ??
ఎందుకీ వ్యధ.. ??
నేను పడుతున్న బాధలే
నా దేశమూ పడుతోంది..!!
మూరెడు బట్ట కరువయ్యి
రోడ్డు మీద బిచ్చగత్తే
అర్ధ స్తనములను దాచలేక దాస్తోంది.. !!
కూటికోసం వేశ్యనారి
కామేంద్రులకు పమిట జార్చి
కుచ సౌఖ్యమునందిస్తోంది.. !!
విలాసంబుల వ్యసనగత్తె
ఖ్యాతి కొరకు తను వనువంతా
అర్పిస్తోంది.. తెరపై
తైతక్కలాడుతోంది .. !!
కన్ను, మిన్ను కానరాక..
వావి, వరుస వేఱిమి లేక..
డమ్మ, టక్క తారతమ్యము లేక..
చిత్తకార్తె శునక జన్మలెత్తి
లిప్తపాటుకు కక్క్రుత్తి నొంది..
వివర్ణుడై, కామ రంకెలేసే
మహిషమై అడ్డు, అదుపులేక
వేశ్యాలోలుఁడై, నిత్యమూ స్త్రీ
దహనమును గావించుచున్నాడు..!!
కళ్ళు ఉన్నా దర్శించలేని వాస్తవికులం...!!
మనసున్నా గ్రహించలేని అనాగరికులం...!!
గడచిన చరిత్రలో మాకు తావులేదు..
ఇప్పుడు నడుస్తున్న చరిత్రకు నీతే లేదు..
సర్వ సమోగ్రమైన భారత రాజ్యాంగాన్ని
రాబందులు లాలిస్తున్నాయ్ .. !!
పందికుక్కులు భుజిస్తున్నాయ్.. !!
శ్రామికుని స్వేద బిందువులు త్రాగి సూరీడు
మరింత తేజస్వి అవుతున్నాడు.. !!
ప్రజల రక్తం జుర్రుకొని
నాయకుడు మహాత్ముడై మెలుగుతున్నాడు ..!!
నా బాల్యం నుంచీ చెట్లు, చేమలు ఎదుగుతున్నాయి..
మార్గాలు నడుస్తున్నాయి..
పల్లెలూ, పట్నాలు సౌందర్యంగా పరిగెడుతున్నాయి
నేను మాత్రం నడుస్తున్నా.. రిక్తహస్తాలతో..
నా దేశం కాని దేశంలో,
నాకేమీ లేని ప్రదేశంలో,
నా జ్ఞాపకాలే అనుచరులుగా,
నా ఊహలే సహచరులుగా,
నా భావాల ఊరేగింపుకు నేనే నాయకుణ్ణి..
వేదనలు, వ్యధలే
నా అక్షర కానుకలు..
నీకెందుకింత అశాంతి,
నీకెందుకింత ఆవేశం అంటే ఏం చెప్పను ??
మరుగుతున్న యువత రాక్తాన్నడుగమంటాను..!!
ఉరకలేస్తున్న నదీ జలాన్నడుగమంటాను..!!
“కలము”నే నమ్ముకుని..
దారి తప్పిన మాయ “దారి” సమాజాన్ని
ద్విగుణీకృతము చెయ్యగ పూనుకుంటిని
వేలకు వేలు అక్షర కుసుమాలు
నా మునివ్రేల్లనుంచి జలజలామని రాల్చాను..
అయినా ప్రయోజనం లేదు..
సమాజంలో మార్పూ రాలేదు..
అలసిన నా ఈ ప్రస్థానంలో ఓ చెట్టు నీడే
నా కుటీరమైంది..
రాలిన ఓ పువ్వే నా అతిధిగా వెలుగొంది..
ఆ తదుపరి
కదలి వచ్చారు కవయిత్రులు ..
కంపించగ వచ్చారు కవివర్యులు ..
కదిలించగ వచ్చారు యువ రచయితలు..
ఇంకేముంది...
ఉప్పెనై లంఘించింది కలము నది..
నికృష్టుల నీచపు చర్యలను తుడిచిపెట్టగ పారింది..
సమతలోని సామరస్యాన్ని పెంచగ
మమతలోని మాధుర్యాని పంచగ
జల జలామని పారింది
యువకుల మెదళ్ళలో ..!!
మొదట నన్ను చూచి కన్నీరు
కార్చిన మేఘపథము
ఇప్పుడు నా తలపై
సప్తవర్ణాల ఇంద్రచాపమును ఉంచింది.. !!
Written by: Bobby Nani
My advice to you is read poetry of stalwarts like Tilak seshendra Krishna Sastry Sri Sri... Before writing. Understand their poems. Improve your language skills before attempting poetry. Advice.
ReplyDelete