ఓయ్ నేస్తమా ....
నా ప్రియ స్నేహమా...
నా హృదయంలో వెన్నెల వెలుగులు ఒలిపిన
ఓ నక్షత్రమా...
ఎవరివే నీవు ?
కవితవా, ?
కావ్యానివా, ??
లేక
కనకానివా ???
ఎచ్చటనుంచి వచ్చావు ..?
నీ రూపం తెలియకపోయినా...
నీ మనసు తెలుసుకున్నాను....
ఏనాటిదో మన ఈ నాటి స్నేహబంధం..
అంతులేనిది, అనంతమైనది.
క్షణకాలపు వ్యవధిలో పరిచయం అయిన మన స్నేహం,
కలికాలపు చరిత్ర పుటలులో సువర్ణ, శోభితాక్షరాలతో,
లిఖించబడు సమయం ఆసన్నమౌతుందని నా కనిపిస్తోంది..
నీ స్థానం నా హృదయపు కోవెలలో ఒక సుస్థిరమైన,
ప్రత్యేకమైన, పరిపూర్ణమైన, పవిత్రమైన స్థానాన్ని,
ఇప్పటికీ, ఎప్పటికీ కలిగివుంటుందని మనస్పూర్తిగా చెప్పగలను...
తలచినవెంటనే స్పందించే మాతృమూర్తివైతివి...
పిలిచిన వెంటనే పలికే ప్రేమమూర్తివైతివి...
బరువెక్కిన హృదయపు భారాన్నితీర్చే సంజీవని వైతివి...
నీవు నా చెంత వుండగా కన్నీటి బిందువుకే
నీళ్ళు కరువాయెనే కదా...
ఓ నా చిలిపి నేస్తమా..
కవిత్వానికే కవితవు నీవు....
కవికే, కవయిత్రివి నీవు...
కనుకరించి కన్నులముందుకు నెలవంకవోలె
ఓసారి వొచ్చి పోరాదే ..
Written By : Bobby Nani
No comments:
Post a Comment