Friday, August 18, 2017

కర్పూరగంధిని...



ఓయ్ సఖీ..
ఎందుకా మధురానందం..
మదిలో పెనవేసుకొనిన
మధుర రాగబంధం
నీలో ఎన్నడూ ఊహించలేని
అదేదో క్రొత్తదనం,
మరేదో మత్తుదనం,
పరిహసించే “పిక” స్వరం,
పరవశించే “నాదు”స్వరం,
నీ గులాబీ వర్ణ చెక్కిలిలో
ప్రస్పుటంగా కానొస్తోంది..!!
ఏమా సంగతి.. ??
ఎందుకా ఆనందం.. ??
నా మునివేళ్ళు నీ ముంగురులలో
జోప్పించి నర్తించు చున్నందుకా.. !!
లేక
ఈ పుష్పకేతుని ఓర చూపుల
వెచ్చని శరముల తాకిడులకా ..
చెప్పవోయ్.. కర్పూరగంధిని..
ఇంతకీ
కోయిల ఏమని పాడెను.. ??
నవ వసంత గీతాలాపన నా చెలి స్వరములోనే ఉన్నదనా... !!
మయూరమెట్లు నర్తించును ??
నవ ఉగాది నా సఖి పాద పద్మములలో నాట్యమై నర్తించుననా...!!
చెప్పవోయ్..
నా కన్నా ముందు కుసుమాస్త్రుఁడుడే చూచుంటే పొంచి పొంచి
వదిలినేమో నీపై ఎక్కుపెట్టిన సుమచాపములు..
నీ నవోన్మేషనవ్య రాగమై,
విరిసెను నవ వసంతం నీ పెదవులపై
పూసిన నవ్వుల పువ్వులలో.. !!!
ఎద అల్లన పులకరించే నా చెలి,
పసిడి మోముని శోభ చూసి,
పరిష్వంగ రధం త్వరితంగా,
మన ఘాడ కలయికను పంచగ వస్తోంది..!!
యుద్దానికి సన్నిద్దమవ్వవే చెలి..!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment