మనకు కనిపించే, మనముందు
జరిగే కొన్ని వాస్తవాలు, వాటి వివరణలు ..
నాకు తెలిసినంతలో
రాస్తున్నాను..
పుస్తకం
జ్ఞాన దీప్తిని పంచే దివ్యజ్యోతి.
చెట్టు
స్వార్ధం ప్రకటించకుండా
ఫలితమును అందించే త్యాగశీలి
యంత్రం
మనిషి ఆలోచనలతో తయారైన
బానిస
దీపం
బ్రతికినంతకాలం చీకటిని
వేటాడే ఓ గొప్ప వేటకత్తె
గాలి
అదృశ్యంగా కదులుతూ కదిలించే
దివ్యశక్తి
నిప్పు
ఉన్నచోట తన ఉనికిని ఉచితంగా
తెలిపే ఉగ్రశక్తి
నీరు
నడుస్తూ ప్రాణాలను నడిపించే
అమర శక్తి
మట్టి
సకల ప్రాణుల ఆవిర్భావానికి
కారణమైన ఆదిశక్తి
ఆకాశం
ఆదినుండి ఆలోచనాపరులకు
అంతుచిక్కని అనంత శక్తి
నిద్ర
భౌతిక శరీరానికి అర్ధ
మృత్యువు
పురుగు
మురుగు ఉన్నచోట ఉద్భవించే
వ్యర్ధజీవి
చీమలు
అలసట, అలసత్వం లేకుండా
శ్రమించే శ్రమైక జీవులు
మాటలు
నెయ్యమును, కయ్యమును,
వియ్యమును కల్పించే కల్పనాశక్తి
విధ్య
మనిషిని మనిషిగా తీర్చిదిద్దే
మహత్తర శక్తి
విద్యుత్తు
ఆలోచనాపరుని విద్వత్తుతో
ఆవిర్భవించిన అభౌతికశక్తి
నేర్పు
నరజాతిని తీర్చిదిద్దిన
ఉచిత శక్తి
ఓర్పు
జాచిత్యం పాటిస్తూ
తీసుకోవలసిన నిర్ణాయక శక్తి
తీర్పు
న్యాయాధిపతి అంతరంగం
వివేకంతో వినిపించే తుదిపలుకు
Written by : Bobby
No comments:
Post a Comment