ప్రపచం చూడబోతోంది ...
******************
ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఏకంగా 103 ఉపగ్రహాలను ఒకే ఒక్క రాకెట్ ద్వారా పంపబోయే మొట్టమొదటి దేశంగా మన భారతదేశం మొదటి స్థానంలో నిలవనుంది. ప్రతీ భారతీయునికి అందబోయే ఓ గొప్ప గౌరవం ఇది .. అందులో మన తెలుగు దేశంలో ఈ రాకెట్ పంపడం.. ముఖ్యంగా నా నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట నుంచి పంపడం నాకు మరింత గర్వకారణంగా ఉంది..
ఇప్పటికే 2008లో ఒకేసారి పది ఉపగ్రహాలు, 2016లో 20 ఉపగ్రహాలను పంపించి స్వీయ చరిత్రను తిరగరాసింది మన దేశం. అయితే ఇప్పటిదాకా అత్యధిక ఉపగ్రహాలను పంపిన దేశాలుగా రష్యా, అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి.
2013లో అమెరికా 29 ఉపగ్రహాలు,
2014లో రష్యా 37 ఉపగ్రహాలు పంపించి మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా .... మన ఇస్రో ప్రస్తుతం 20 ఉపగ్రహాలను పంపించిన మూడో దేశంగా నిలిచింది.
ఫిబ్రవరి మొదటివారంలో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్ ద్వారా 103 ఉపగ్రహాలు ప్రయోగం అనంతరం ఒకే దఫాలో అత్యధిక ఉపగ్రహాల్ని పంపిన మొట్టమొదటి దేశంగా భారత్ ఆవిర్భవించనుంది.
ఇంతటి గొప్ప కార్యం గురించి ఎవ్వరూ నోరు మెదపకుండా ఉండటం నిజంగానే ఇది శోచనీయం...
ఒక ప్రాంతానికి సంబంధించిన జల్లి కట్టు, కోడి పందెంల గురించి మాత్రం గింజేసుకుంటున్నారు, రక్కేసుకుంటున్నారు, ఒకరికొకరు గోకేసుకుంటున్నారు ... వీటిపై చర్చలు, గొడవలు, బూతులు, తమిళుల సత్కార పద ప్రయోగాలు..
నిర్మొహమాటంగా మన గురించి మనం చెప్పుకోవాలంటే “ఎదుటివారిని స్తుతించడంలో మనకు మనమే సాటి”... యావత్ భారతదేశం సగర్వంగా తల ఎత్తుకునే రోజు రాబోతుంది.. ప్రపంచ అగ్ర రాజ్యాల సరసన వున్న మన దేశం వాటిని దాటి మరింత ముందుకు వెళ్లబోయే క్షణం అది..
ఇది ఓ రేపటి చరిత్ర.. అలాంటి విషయాన్ని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం గమనార్హం... అయినా మనకు ఇవన్నీ ఎందుకు ??
గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం వచ్చిందా .. పొద్దుగాలే లేచామా.. కార్యాలయానికి, కాలేజీకి వెళ్ళామా .... మొహమాటానికి జెండా వందనం చేసామా.. రెండు చీకులేట్లు సప్పరించామ... దేవులాడుకుంటూ కొంపకు వచ్చి తొంగున్నామా .... లేక ఊరంతా తిరిగామా.... ఇదే కదా ఆ రెండు రోజుల మన భాగోతం ...
బాహుబలి మొదటివారం యెంత గ్రాస్ చేసిందో నిద్రలో వున్న మిమ్మల్ని అడిగినా చెప్పేస్తారు..
150 సినిమాలో చిరంజీవి గారి డాన్సులు గురించి చర్చలు, రచ్చలు, రావిళ్లు ..
శాతకర్ణి బాలక్రిష్ణ గారి గురించి విమర్శలు, ప్రసంశలు.. ఇవే మనకు ముఖ్యం..
రెండున్నర గంట సినిమాకు పంచే మన సంతోషం కొన్ని దశాబ్దాల చిరిత్రకు ఇవ్వలేమా ??
సినిమా కన్నా మన జీవితంలో మరేది ముఖ్యం కాదా.. ??
హీరోలకే నా నువ్వు ఫ్యాన్ .. మన దేశానికి.. దాన్ని నడిపించే ముఖ్యులకు కాదా.. ??
రేపటి మన ఘనత సువర్ణాక్షరాలతో ప్రపంచ చరిత్రలో మొదటి స్థానంలో లిఖించబడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ... ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెల్పుతున్నాను..
జైహింద్...
Written by : Bobby
No comments:
Post a Comment