బావా మరదళ్ల సరసాలు అందరికీ విదితమే .. అలాంటి బావా మరదళ్ళు నూతన దంపతులై మూడు రాత్రుల ముచ్చట ఇంకనూ తీరకమునుపే వారి ఇద్దరినీ ఒక్కదగ్గర ఉంచితే వారి కొంటె సరస సయ్యాటలను చూచుట సాధ్యమా.. వారి మధ్య ప్రేమ వెల్లివిరుస్తుంది.. నవ్వులు పువ్వులై పరిమళాలు దిశ దిశలా వ్యాప్తి చెందుతాయి.. అది పున్నమి వెలుగుల్లో ఆరుబయట మల్లెల చాటున నులకమంచం మీదన అయితే ఇక చెప్పనక్కరలేదు.. ఇలాంటి ఒక మధుర అనుభూతి రాయాలనిపించింది.. ఇక్కడ శృంగారం కనపడదు.. కాని హృదయంలో ద్రవిస్తుంది.. ఓ రచయిత గా ఇలా చూపే చిరు ప్రయత్నమే ఇది. ఇక్కడ మన వ్యవహారిక భాష కాకుండా యాస మర్చి రాయడం జరిగింది.. కావున మీరు చదువు సమయంలో ఆ యాసతో కనుక చదివితే అందులో మాధుర్యం అర్ధం అవుతుంది..
ఇరగ్గాసిన పండు వెన్నెలలో ..
దట్టమైన చీకటి కారుమబ్బుల మాటున
నక్కి నక్కి చూస్తున్న నెలరేయి సిగ్గుల హొయలు..
కనిపించి కనిపించని మసక మసక
రేయి పొరల వెలుగులలో,
సన్నజాజి పూ చెట్టు తోట కాడ..
గడ్డివాము ఎనకాల నులకమంచమెక్కి కూకున్న మా బావ
అరువుకో ముద్దు అప్పుగా ఆరా ఆరా ఇస్తుంటే..
మలయమారుతపు శీతల పైరు గాలికి
బిగుసుకున్న నా దేహాన్ని..
బావ బిర బిరా చుట్టేస్తుంటే..
తన వెచ్చని ఊపిరులకు నా మనస్సు
ఉలిక్కి ఉలిక్కి పడతాంటే...
ఉడుకు రకత మంతా వొంట్లోన ఓ సోట చేరి
ఉర్రూతలూయిస్తాంటే..
తెలియని మత్తు నన్నావరిస్తాంటే..
ఆ పున్నమి రేయి లా మా బావ..
ఆ రేయిలోని చిరు చీకట్ల చిన్నదానిలా నేను మిళితమై..
ఝల్లు ఝల్లు మనే గాజుల చప్పుడు,
ఘల్లు ఘల్లు మనే అందియల చప్పుడు ఎనాటికాగునో
మా సరసాల బావ చిలిపి చేష్టలకు..
Bobby Nani
No comments:
Post a Comment