స్వప్నలోక రాజ్ఞి
************
ఇంకా నాకు గుర్తుంది
నేను
ఆమెపై రాసిన
అక్షరాలన్నీ
సువాసనలై నల్దిశలకు వెళ్ళిరావడం..!!
అదేంటో కానీ
ఆమె
ఎదురు పడినప్పుడల్లా
నా పెదవులకు మౌనం వేళ్ళాడుతూవుంటుంది
ఆమెను
కలిసిన ప్రతీసారి
విశ్వరహస్యాలను ఒక్కొక్కటిగా
చేధిస్తూ ఉంటాను...
ఆమె తలఁపుల ఆత్మీయ భావాలు
అమ్మలా నా తలలో వేళ్ళు పెట్టిమరీ
నిమురుతూ వుంటాయి..!!
మూడు పదులు దాటినా కూడా
ఆమె ...
పాలలో వెన్నెలవలె
పైడిపళ్ళెములోని జున్నువలె
జాబిల్లి మబ్బుతునకపై మోహినీరూపిణియై
కనుల ముంగిటకొచ్చిన ప్రతీసారి కొత్తగానే కనిపిస్తుంది..!!
ఓయ్ “లేక్షణ”
ఎన్ని పేర్లుతో పిలవను నిన్ను
నా జ్ఞాపకాలకు “విధ్యున్నారి” గా
నా భావాలకు “ఇంద్రజాలివి” గా
నా ఊహలకు “ఉరుతిమిర మరుసంచారిణి” గా
నా అక్షరాలకు సొబగులద్దె “సుప్తమధుకీల” గా
నా పదాలకు పరిమళములద్దే “విజ్ఞానమయ జగద్వీధిని వాసిని” గా
నా అన్నీ నీవై నడిపించు “నాంచారిణి” గా నను
ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ ఉంటావు..
నే రాసుకున్న ప్రేమలేఖలన్నీ
అక్షర మక్షరమై నీ
రూపాన్ని ప్రసవించినట్లువున్నాయే
ఓ రమణీ,
ఎంతటి ఆనందమే
నువు నా చెంత నుంటే..!!
నువ్వు,
నా బాహువుల మధ్యన తలపెట్టి
నా ఛాతి పై నిద్దురోతున్నప్పుడు
కళ్ళార్పకుండా నిన్నే చూస్తూ,
తెల్లారకూడదని కోరుకుంటూనే
నా అధరములను
నీ లలాటమునకు ఆన్చి
ఎప్పుడు పడుకుంటానో నాకే తెలియదు..!
తెల్లవారున మాత్రం నగ్న శరీరాలతో
రెండు లతల్లా పెనవేసుకొని ఉంటాము..!!
జీవితం ఎక్కడ మొదలైందో నాకు గుర్తు లేదు కానీ
నీ ఒడిలో నే తలపెట్టి రెప్పవేయక నిన్నే చుస్తున్నప్పుడే
నా జీవితం ముగుస్తుందని మాత్రం తెలుసు..!!
Written by: Bobby Nani
1 వ చరణం- అదుర్స్. 2 వ చరణం- అద్భుత్సం. చివరి చరణం- 'బూతో' బీభత్స జుగుప్స్.
ReplyDelete