పెదాల మీద రాలిన వానచినుకు
కళ్ళమీద వొలికిన ప్రకృతి రంగు
మనసుకు అంటుకున్న జ్ఞాపకం
అన్నీ నిన్నే గుర్తు చేస్తాయి
ఎందరో బంధువులు,
మరెందరో మిత్రులు
అక్కడక్కడా శత్రువులు కూడా వున్నారేమో..!!
ఇంతటి జనసందోహంలో
నాకు అడుగులేయటం నేర్పీ
నా చేయి పట్టుకొని నడిపించావు
నీ బాల్యాన్ని మర్చిపోయి
నీ స్వప్నాలను చెరిపేసుకొని
చిన్నపిల్ల ముసలివేషం వేసినట్లు
నీ వయసును పెంచుకొని
నాకు తల్లివయ్యావు..!!
నేను మాట నేర్చుకుంది నీ నోటితోనే
నడవటం, నవ్వటం
పడటం, లేవటం
అన్నీ నీ చీరకుచ్చిళ్ళు పట్టుకునే..!!
బాధనీ, భారాన్నీ
వేదననీ, వెక్కిళ్ళనీ,
కష్టాల్నీ, సుఖాల్నీ
నీ చిరునవ్వు ఆసరాతోనే స్వీకరించాను
మంచినీ, మనిషినీ,
ప్రేమనీ, త్యాగాన్ని,
అనురాగాన్ని, ఆప్యాయతనీ
బంధాన్ని, బాంధవ్యాన్ని
నేర్చుకుంది నీతోనే ..!!
ఇన్నేళ్ళు గడిచాయి
ఎన్నో సంఘటనలు దొర్లిపోయాయి
ఇంతదూరం వచ్చాక
ఇక్కడ నిలబడి కాసేపాగి
వెనక్కి తిరిగిచూసుకుంటే
ఇంకా
నా మీద నీ కొంగు నీడ
నా వేలు పట్టుకొని
నడిపిస్తూ వుంది..!!
ఎంత ఓపిక !
ఎంత ప్రేమా !
నిన్ను నీవు మరిచిపోయి
నాకు జీవితం పంచిపెడుతున్నావు
నీ వసంతాలన్నీ నా మీద వొంపి
అక్షరమంత అందంగా పెంచావు
నీ వయస్సు మీద పడేకొద్దీ
నిన్ను నా బిడ్డను చేసుకొని ఆడించుకొని
నీ రుణం తీర్చుకోవాలని వుంది
నన్ను నేను గుర్రం చేసుకొని
నిన్ను నీ బాల్యం వరకు మోసుకెళ్ళాలనుంది..!!
నువ్వు అల్లరి చేస్తూ,
బొమ్మల్తో కొట్టుకొని పుస్తకాలు చించి
చాటుకెళ్ళి బలపాన్ని తింటుంటే
గట్టిగా మందలించాలని వుంది
నువ్వు ఏడుస్తుంటే
నిను నా గుండెలకు హత్తుకొని
నీ ముఖం కడిగి, తలదువ్వి
నీ రెక్క పట్టుకొని సంతకు తీసుకెళ్ళి
తియ్యని మిఠాయి తినిపించాలనుంది..!!
ఒక్క అవకాశం
ఇస్తావా అమ్మా??
Written by: Bobby Nani
Very heart touching poem bayya.
ReplyDeleteచాలా బాగా వ్రాసారు.
ReplyDelete
ReplyDeleteహమ్నయ్య బుచికీ మెచ్చిన పోయెమ్ము :)
జిలేబి
ReplyDeleteహమ్మయ్య! బుచికి మెచ్చిన
ఝుమ్మను పోయెము సెబాసు సూవె జిలేబీ!
యమ్మ పయిన గీతమ్ముగ
అమ్మమ్మో బాబి నాని యద్భుత మయెరా :)
జిలేబి
# "జిలేబి" గారు
Deleteనిజానికి "బుచికి" గారు మంచి critic అనిపిస్తారండీ .... నా దృష్టిలో.
(Disclaimer :- "బుచికి" గారితో నాకేమీ వ్యక్తిగత పరిచయం లేదు.)
జిలేబీ గారి పద్యాలు చదివితే పునర్జన్మ న విద్యతే.నన్ను మెచ్చుకున్న తొలివ్యక్తి మీరే సార్.
ReplyDelete# "బుచికి" గారు
Deleteమీరు deserving అనిపించారు కాబట్టే ... మెచ్చుకోలు 👍.
This comment has been removed by the author.
Delete// "సూపర్స్టార్ గుర్తిస్తేనే గుర్తింపు..నేpoMm." //
Deleteఅఫ్కోర్స్. "ఎనీ డౌట్"?
😎