Thursday, May 10, 2018

స్నేహ మయూరము..



స్నేహ మయూరము..
***************

రాగాల ఉషస్సులో 
ఉషోదయపు తేజస్సులో 
పౌర్ణమినాటి నీ హృదయాకాశంలో 
నేనొక తారను..! 
అమావాస్య లాంటి నా హృదయాకాశంలో 
నీ వొక చిరుదివ్వెవు..!!

ఓ స్నేహ విపంచి, 
నీ హృదయ సంద్రంలో నేనో స్నేహ అలనై,
నీ ప్రతీ అడుగులొ నేనో లయనై,
నీ ఆలోచనలొ నేనో భావాన్నై,
నీ రూపంలో నేనో బింబాన్నై అనుక్షణం 
నీవెంట నడవాలని ఉంది.. !!

ఓ స్నేహ మయూరి.. 
నీకు తోడుగా తటిల్లతనై పోయి 
నీ జీవన సంధ్యా రాగంలో 
నేనొక పవన వీచికనై పోవాలని ఉంది.. !!

ఓయ్,
ఓ అవకాశ మిస్తావా.. ?? 
నీ స్నేహపు గగనానికి ఇంద్రచాపమై ఉండిపోతాను.
నీ నుంచి ఇక ఈ జన్మకి ఏమీ వద్దు నేస్తం.. !!
Written by : Bobby Nani

No comments:

Post a Comment