Tuesday, May 1, 2018

ఆమె జీవితంలో..



ఆమె జీవితంలో..
రాగం స్పందించింది 
త్యాగం చిందించింది.. !!

తన రక్తం లోని సారం తీసి 
తన శుక్తంలోని శుక్రం తెచ్చి 
తన ఆస్థుల్లోని మూలుగ కోసి 
తన మస్తిష్కంలోని మంతువు త్రచ్చి 
పురుషుణ్ణి సృజించినది 
పుత్రుణ్ణి స్పృశించినది
అర్భక జీవన పిండం ఆమె తనువున సోలి 
ఆమె రుధిరరసం మధురరసముగ గ్రోలి 
ఇంతై అంతై అంతంతై వింతగా మారింది 
మీసాలు మొలిచిన మొనగాడు 
రోషముతో మెలి వేశాడు 
స్త్రీ అబలనే సిద్దాంతాన్ని ఒక్కటి చేశాడు 
శ్రీ మత్పురుషుని ప్రక్క ఎముకలో 
స్త్రీ పుట్టిందని చాటి చెప్పాడు.. 
స్త్రీ ని చూచి
నేను భర్తను, నువ్వు భార్యవు 
అన్నాడు.. 
భరించేవాని వేడి భరింపలేక పోయిందా చిగురుబోడి 
“ఈ లోకాన్ని ఏ లేది నేనే” అని అహంకరించాడు 
“నీ కెందుకు మూలన కూర్చో”మని హుంకరించాడు 
“శ్రేయస్సాధనకోసం కృషి చేస్తా”నని లేచాడు
కర్కశకరముల భూమిని త్రవ్వగ 
క్షారజలములే ఊరినవి.. 
ఉప్పునీటిని పారింపంగా 
ఊషర భూమిగ మారినది 
ఊషర భూమిని పైరు పెట్టగా 
ఉమ్మలికములే పండినవి 
సాధుజనులకూ, సామాన్యులకూ 
సౌఖ్యములన్నియు ఎండినవి 
సత్యాన్వేషణకోసము శాస్త్రము త్రవ్వి చూడగ 
ఆమె లేని అక్షరము లేదు
ఆమెపై లిఖించని పుటయే లేదు 
ప్రజాస్వామ్య మంటే పురుషస్వామ్యం కాదు.. 
అతివలు లేకుంటే అందులో స్వామ్యమే లేదు ..!!

ప్రజాస్వామ్య మంటే మానవత్వం, 
మానవత్వ మంటే సమానత్వం,
సమానత్వ మంటే సహకారతత్వం, 
కొన్నాళ్లు నిలిస్తే మంచిది పురుషుల అధికారపాలనం..!
నిజ అభ్యుదయానికి అవసరం అతివల అనురాగలాలనం..!!

Written by: Bobby Nani

No comments:

Post a Comment