నీ అందం,
తడి కురుల మధ్య ద్విగుణీకృతమౌతుంది..
నిండు వెన్నెల్లో నీ ముక్కు బేసరి తళుక్కున మెరుస్తుంది..
కొబ్బరిచెట్ల మధ్యనుంచి పరిగెత్తుకొచ్చి
లే..లేతాకుపచ్చ యవ్వనం నీ వొంటిపై ప్రవహిస్తుంది..
పున్నమిలో నీ కళ్ళు చిగురిస్తున్నప్పుడు
నాలోలోన చిన్నగా వానజల్లు ప్రారంభమౌతుంది..
జల జలా వాగు ప్రవహిస్తున్నట్లు నాలో
తియ్యని స్వరమేదో రాగాలు విరజిమ్ముతూ ఉంటుంది..
నీ విరబోసుకున్న కురుల మధ్య
నా లేత కోరిక వ్రేల్లాడుతూ ఉంటుంది..
నా ఎదుట నువ్వు పరిమళాలు వెదజల్లుతూ
చిలిపిగా నన్ను పల్కరిస్తున్నప్పుడు
ఏ కొండపైనుంచో నేను చల్లటి
పాల సముద్రంలోకి దూకుతున్నట్లుంటుంది..
దోర పెదవుల నీ నవ్వు
నాలో వేయి మంజీరాల్ని మీటుతుంది..
కోటి వీణలు మ్రోగిస్తుంది...
నా కోర మీసం నీ మెడ అంచులకు తగిలినప్పుడు
మునుపంటి బిగించిన అధరములతో
మునివేళ్ళు ముడిచిన హస్తాలతో
కొయ్యబొమ్మలా కొయ్యబారిపోతుంటావు
నీ వెచ్చని శ్వాసలు నను తాకుతూనే ఉంటాయి..
నీ ఎద చప్పుళ్ళు వినపడుతూనే ఉంటాయి..
నీ ఊహల కౌగిళ్ళ చిలిపి సరసాల మాధుర్యములలో
నేనెప్పుడూ నీకో తనివితీరని కోరికనే..
ఆ పసిడి దేహపు పరువాలు..
ఊరువుల వాల్జడల నాట్య బంగిమలు..
లేలేత గులాబీ వర్ణముల ఎద సౌందర్యములు..
నాజూకు నడుముల నయగారములు ..
తకదిమ్మి, తద్దిమ్ముల కటీరముల కులుకులు..
ఆపాదమస్తకం నిను దర్శించినా,
ద్రాక్ష ఫలములను పెదవులతో సలిపినా
శంఖం లా నిను పట్టి పూరించినా..
నీ అందం తరుగునా,
ఇసుమంతైనా కరుగునా...
బ్రహ్మాండమ్మును ఉదర వృత్తములో దాచుకుంటివి..
సృష్టి స్థితిలయలను మర్మస్తానమునుంచి ప్రసవిస్తివి..
అందుకే నువ్వు శుభాంగివి ..
నా శోభిణివి.. !!
Written by : Bobby Nani
No comments:
Post a Comment