Monday, September 18, 2017

మన దక్షిణ భారతదేశ చరిత్ర..


శతాబ్దాల చరిత్ర .... సముద్ర గర్భంలో మునిగిపోయింది...!! 

కాలగర్భంలో కలిసిపోయింది..!!

చరిత్ర పుటలులో చెరిగిపోయింది..!! 

వైభవోపేతంగా, సకల శిరి సంపదలతో శోభాయమానంగా విరాజిల్లిన నాటి "పాండ్యుల చరిత్ర" నేడు మనకో ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది.. !!

Kumari Kandam

కొన్ని నెలలకు ముందు తమిళులకు సంబంధించి, వారి సంస్క్రుతి, సాంప్రదాయాలకు సంబంధించి, ముఖ్యంగా వారి చరిత్రకు సంబంధించిన ఓ గ్రంధాన్ని నేను చదువుతున్న సమయంలో ఈ పాండ్యుల చరిత్ర నా కంట పడింది.. ఏంటో తెలియదు ఆ గ్రంధంలో వారి గురించి స్వల్పంగా వ్రాసి ఉన్నప్పటికీ .. ఆ వ్రాసిన కాస్త చరిత్ర చదవగానే నాలో ఇంకా ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది.. అప్పటినుంచి నా వెతుకులాట మొదలైంది.. ఒక పుస్తకంలో నుంచి మరో పుస్తకంలో ఈ ప్రస్తావన ఉందని తెలిసి అది చదవడం.. ఆ పుస్తకం లోనుంచి ఇంకో పుస్తకంలోకి వేరొక ప్రస్తావన ఉందని తెలిసి చదవడం.. అలా చదువుకుంటూ దాదాపుగా ఓ ఆరు పుస్తకాలు చదివెయ్యడం జరిగింది.. స్నేహితులు, పూజ్యనీయుల సహాయ, సహకారములతో నేను కొంత విషయాన్ని తెలుసుకోగలిగాను.. అలానే వికీపీడియా, ఎన్సైక్లోపీడియా ద్వారాయున్నూ మరియు కొన్ని సంవత్సరములకు పూర్వం ప్రచురించిన పత్రికల ద్వారాయున్నూ, యుట్యూబ్ ద్వారాయున్నూ, నేను ఈ పాండ్యుల చరిత్రను తెలుసుకోగలిగాను ... 

కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ??

ఓ చరిత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఎప్పుడు ముగిసిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు... కాని మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళ, పాండ్య, చెర, వంటి రాజ వంశస్థులైన వారి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలిశాయి.. చోళ, చెర రాజ వంశస్థులు పరిపాలించిన కళాఖండాలు, వారు ఉపయోగించిన వస్తు, సామాగ్రి తమిళనాడు పరిసర ప్రాంతాలలో పురావస్తుశాఖవారికి అనేకం దొరికాయి.. అందువల్లే వారి ఇరువురి చరిత్ర మనకు చాలా సులభంగా దొరుకుతుంది.. కాని పాండ్యుల చరిత్ర మాత్రం దొరకడం అసాధ్యమైంది.. దానికి కారణం వారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోవడమే... !!!

Pandya Empire 


దాని గురించే నా అన్వేషణ మొదలైంది.. 

నేను తెలుసుకున్నది పాండ్యుల చరిత్ర 6వ శతాబ్దం నాటినుంచి మొదలైందని... కాని... ఇందుకు నా మనస్సు అంగీకరించలేదు... నా ఊహ ఇంకా ముందునుంచే వారి చరిత్ర ఉందని పదే పదే చెప్తూ వుండేది.. ఆ దిశగానే నా అన్వేషణ మొదలుపెట్టాను.. నిజంగానే నేను ఊహించింది నిజమైంది.. 
Pandya Empire Flag


2వ లేదా 3వ శతాబ్దపు అశోక చక్రవర్తి పరిపాలనలోనే సున్నపురాయి మీద మేజర్ రాక్ ఎడిక్ట్ 13వ శాసనం పై అశోక చక్రవర్తి చెక్కించిన స్తూపం ఆధారంగా పాండ్యుల చరిత్ర అప్పటికే ఉందని ఆధారితమైనది .. కానీ ఇప్పటికీ వారి మొదలు ఎప్పుడు అనేది ఓ ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది... !!
Asoka 13th Major Rock 

అంతేకాదు మన హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగం నాటినుంచే పాండ్యులు తమిళనాడును రాజ్యమేలుతున్నారని ఆధారాలు వున్నాయి.. పాండ్యుల రాజధాని మధురైగా వుండేది.. శ్రీలంక రాజు అయిన రావణుడు పాండ్యుల శక్తి, సామర్ద్యాలను చూచి నివ్వెరపోయి ఆ పాండ్య రాజుతో ఆనాడే శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కాళిదాసు వ్రాసిన "రఘువంశం" అను పుస్తకంలో పేర్కొని వున్నారు..

Kalidas Raghuvamsham


ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. అసలు విషయం వేరే వుంది... 

పాండ్యుల చరిత్ర ఒక్క దక్షిణ భారతదేశంలోనే కాదు.. త్రేతాయుగం కంటే కూడా ఎన్నో వేల సంవత్సరములకంటే ముందుగానే దక్షిణ భారతదేశానికి దిగువున వున్న హిందూమహాసముద్రంలో శ్రీలంకను కలుపుతూ కొన్ని వేల మైళ్ళ దూరంలో తూర్పు దక్షిణ శ్రేణిలో ఉన్నటువంటి మడగాస్కర్ ను మరో వైపున ఉన్నటువంటి ఆస్ట్రేలియాను కలుపుతూ ఓ భారీ ఖడం ఉండేదని చరిత్ర చెప్తోంది.. ఈ భారీ ఖండాన్ని " కుమారీ కంధం" లేదా "కుమరినాడు" లేదా “కుమారి కండం” గా పిలిచేవారని పురాణ, ఇతిహాసాలు చెప్తున్నాయి.. 

Lemuria

ఈ “కుమారి కండం” ను పాండ్యులు పరిపాలించినట్లు, పాండ్య రాజుకు ఎనిమిది మంది కుమారులు, ఒక్క కుమార్తె కలదని.. ఆ ఎనిమిది మంది కుమారులకు ఎనిమిది రాజ్యాలను అప్పగించి మిగిలిన తన ముద్దుల కుమార్తె అయిన “కుమారి”కి ఈ “కుమారి కండం” ని అప్పగించినట్లు అందువల్లే ఆమె పేరుతో ఈ ఖండం ఏర్పడినట్లు మన పురాణాలలో పేర్కొని ఉన్నారు.. మహాభారతంలో కూడా పాండ్యుల చరిత్ర ఉన్నట్లు ఇతిహాసాలలో వ్రాసి ఉన్నారు... 

Ithihas

Ithihas

"కుమారీ కంధం" అనే పదము మొదటిది, కంచిపపశివచారియర్ (1350-1420) రచించిన స్కంధ పురాణము అనే గ్రంధంలో 15వ శతాబ్దపు తమిళ సంస్కరణ అయిన “కందా పురాణము” గురించి వ్రాసి ఉన్నారు.. ఇదంతా ఒక ఎత్తు అయితే .. 1864వ సంవత్సరములో, ఇంగ్లీష్ జూలాజిస్ట్ శాస్త్రవేత్త అయిన Philip Sclater ఓ ఆశ్చర్యకరమైన విషయానికి తెరలేపారు.. 

Skanda Puraan

Philip Sclater
అదేంటి అంటే.. 

“Lemur” అనే జీవి మడగాస్కర్ ప్రాంతంలో తప్ప ప్రపంచం మొత్తంలో మరెక్కడా కనిపించదు.. అలాంటిది దక్షిణ భారతదేశ సరిహద్దులలో ఈ జీవి వున్నట్లు తను కనుగొన్నారు.. మడగాస్కర్ కు ప్రక్కన వున్నఆఫ్రికా ఖండంలో మాత్రం ఈ జీవి మనుగడ లేదు.. ఇక ఆ దిశగా తన అన్వేషణ మొదలైంది.. ఇన్ని వేల మైళ్ళు ఈ జీవులు సముద్రంలో ప్రయాణించి దక్షిణ భారతదేశంలోకి రావడం అసాధ్యం.. మరేమైవుంటుంది ?? 

Lemur


national institute of oceanography

అప్పుడే తను మన భారతదేశానికి, మడగాస్కర్కు మధ్యన ఓ భూభాగం ఉండొచ్చు అని నిర్ధారించుకున్నారు.. ఆ భూభాగం సముద్ర మట్టానికి చాలా తక్కువ స్థాయిలో ఉండేదని, అప్పుడప్పుడు ఆ భూభాగాన్ని వరదలు ముంచెత్తుతూ ఉండేవని ఆయన అభిప్రాయ పడ్డారు.. అలానే “National Institute of Oceanography” వారు సర్వే చేసిన సర్వే ప్రకారం ఒకప్పటి సముద్ర మట్టానికి ఇప్పటి సముద్ర మట్టానికి ఊహించని రీతిలో సముద్రమట్టం పెరిగిపోయింది వారు ఓ నివేదికను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.. ఇలా ఎన్నో వేల సంవత్సరముల క్రితం ఆ భూభాగం ఓ పెద్ద సునామీ కారణంగా భారతదేశానికి, ఆ భూభాగానికి మధ్యగల సంబంధం తెగిపోయిందని.. తన ఉనికిని కోల్పోయిందని ఆ శాస్త్రవేత్త “The Mammals of Madagascar” అనే పుస్తకంలో ప్రతిపాదించారు. అంతే కాదు.. ఈ భూభాగానికి “Lemuria” అనే నామకరణం కూడా చేసారు.. 
Lemuria

ఇది ఊహాజనితమైన భూభాగం అని కొందరు శాస్త్రవేత్తలు కొట్టిపారేసినా.. మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇది నిజమని చెప్తూ.. మరింత ఆధారాల కోసం వెతుకులాటలో నిమగ్నమై ఉన్నారు.. 

ఇదండీ సంగతి.. 

ఇది తెలుసుకునే ప్రయత్నంలో నా అన్వేషణ, నా ప్రయాణం చాలా ఉత్సాహంగా సాగిపోయింది.. ప్రతీ రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ, సమయంతో పరుగులు తీస్తూ.. సమయమే తెలియకుండా గడిపిన క్షణాలనెన్నో నేను అనుభవించాను.. అంతా అయిపోయిందా అనే భావమే నాలో ఏదో తెలియని మౌనాన్ని మిగులుస్తోంది.. 

ఈ ఆర్టికల్ చదివాక దీనిపై మీ స్పందనను తెలియజెయ్యడం మాత్రం మర్చిపోకండి.. __/\__

Written by : Bobby Nani

8 comments:

  1. Replies
    1. ధన్యవాదములు అండి.. __/\__

      Delete
    2. Go to mahaswamy periyam kanchi mahaswamy he mention with his third eye australia africa once upon time india land and everything about history

      Delete
  2. చాలా బాగున్నది మీ అన్వేషణ మీరు తెలుగువారు అయినందున తెలుగులో చదివి చాలా ఆనందిచాను.మీకృషి ఇంకా కోనసాగాలని కోరుకుంటునాను.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా అండి.. ఇలానే నా అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది.. మీ స్పందనకు కృతజ్ఞుణ్ణి __/\__

      Delete
  3. చరిత్రాభిలాషులకు బాగా ఉపయోగపడేలా ,పరిశోదనాత్మకముగా ఎంతో చక్కటి విశ్లేషణనిచ్చారు ....నాని గారు

    ReplyDelete
  4. ఇది ద్రవిద పార్టీలు తమకు లేని ఔన్నత్యాన్ని కల్పించుకోవటానికి ఈ మధ్యనే ప్రచారం చేస్తున్న పొలిటికల్ స్ట్రాటజీ మాత్రమే!ప్రస్తుతం తమిళులలో రెండు రకాల వారు ఉన్నారు.సంస్కృతం కూడా తమిళం నుంచే పుట్టిందనీ ప్రపంచంలో కల్లా తమదే సర్వోన్నతమైన సంస్కృతి అని చెప్పుకోవడం,దానికోసం ఎక్కడెక్కడి కల్పనలనూ ఇతరులెవ్వరికీ ఆధారాలు దొరకని విషయాలను కూడా ఒక్కచోట చేర్చి సిద్ధాంతాలు తయారు చెయ్యటమూ అసలు రుజువుకు దొరకని వాటిని సునామీల పేరుతో కప్పేస్తూ ఉండటమూ వీరి ప్రధాన లక్షణాలు.మీరు చూపించిన మ్యాపులో అంత విస్తీర్నం ఉన్న భూకహందం అదృశ్యం క్వాతానికి ఎంత పెద్ద సునామీ రావాలో కాళ్ళూ కళ్ళూ నేలమీద పెట్టుకుని వూహించి చూడండి!ఈ పైత్యం లేని తమిళులే వీటిని వ్యతిరేకిస్తున్నారు - తెలుగువాళ్లం మనం ఈ గొదవలోకి పోవతం అనవసరం!

    ఆర్య-ద్రవిడ మరియు ఆర్యుల దాడి అనే సిద్ధాంతాల్ను పేనే సమయంలో రొమిల్లా ధాపర్ లాంటివాళ్ళు చేసిన హడావిడి కూడా ఇంత గంభీరంగానూ జరిగింది - ఇదీ అంతే.

    ReplyDelete
  5. ఇది ద్రావిడపార్టీలు స్టార్ట్ చేసినా ప్రాపగాండా అండి. రుజువులు లేవు కేవలం ఊహ మాత్రమే ..అంతవరకే

    ReplyDelete