Wednesday, August 16, 2017

\\\\ కలహంస ////



\\\\ కలహంస ////
*************

కల కనిపించిన కమనీయ రూపమా..
కన్నుల వెలుగును నింపిన తేజమా..
కల ... కరిగించకే,
వెలు ... గార్పేయకే,
ఈ పేద హృదయం నీ కంకితమని గుర్తించవే .. !!

నీ మది వీణను మీటాలనీ,
సుశ్రుతి బ్రతుకున విరియాలనీ,
సరాగాలు పలికిన సరిగమలూ,
చెరగని ఆనందలయ హొయలూ,
వేణువై, విపంచివై, నాదమువై, నిస్వనమై
నన్నేలవే నా భావ గీతమై..

ఓయ్ బంగారం ... నిన్నే!!
వినపడుతోందా..

వెదురు కర్రను వేణువుగా మార్చి,
రాగాలు పలికించు అధరములను జేర్చి,
మధుర స్వరాల మానినీ ... !!
కోకిలరావాల ఆమినీ.. !!
మొహనవై, కల్యాణివై, హరివిల్లువై, కలహంసవై,
నను మురిపించరావే మధు గీతికవై.. !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment