అవి పాదాలా లేక పద్మాలా ..
సృష్టిలోని సౌందర్యాన్నంతా వడపోసి
చేసాడే ఆ బ్రహ్మ.. !!!
శఖం ఆకృతిలో .. సంపెంగెను పోలి,
ప్రధముడను సైతం అధముడను చేస్తున్నాయి..
అజ్ఞానిని సైతం విజ్ఞానిని గావిస్తున్నాయి..
ఏదో మహత్యం ఉందే నీ పాదాలలో ..
పారాణిని అంటిన ఆ లేలేత
మీగడ వంటి పాదాలు నేలను ముద్దాడుతుంటే ..
పులకరింతలు గలిగి పరవశమ్ము నొందెను ధరిత్రీ..
ఒయ్యారాల ఒలకబోతలతో ..
సుతిమెత్తని సురేఖాతి స్పర్శలతో..
ఘల్లుఘల్లుమను పసిడి మువ్వల సవ్వడులకు..
ఝల్లు ఝల్లుమని అదిరిపడుతోంది నా హృదయ అందియ.. !!
ఎలా చేరను నిను.. !!
ఎలా చూడను నిను..!!
వాన చినుకునై నిను చేరుకోనా ..
వాయువై నిను చుట్టేయ్యనా..
భువనమై నిను కాచుకోనా ..
అగ్నినై వెలుగును పంచనా..
పుడమినై నాలో చేర్చుకోనా ..
ఈ అనంత విశ్వంలో ఎన్ని తారలున్నా..
నా దివ్య తారవు నీవే..
సంద్రపు కెరటాలు విరుచుకుపడినా...
నావ వై నను నడిపించేది నీవే..
సృష్టిస్థితిలయలు గతులు తప్పినా
నా జీవన యానపు ఊపిరి నీవే..
శ్వాసతో కాదే.. నువు విడిచిన జ్ఞాపకాలతో బ్రతికేస్తా..!!!
Written by : Bobby Nani
నేను కూడా పాదాభిమానినేనండీ. ఎంత బావున్నాయో ఆ పాదాలూ!
ReplyDeleteDhanyavadamulu sir..
Delete
ReplyDeleteపాదాభిమానులిచట
న్నాదము జేసిరి జిలేబి నాట్యము లాడ
న్బో ! దారిన్గనిరి సుమా
పాద కుసుమముల కురంగ పసిమిని గూడన్ :)
జిలేబి
Adbutham sir ..
Deleteబాబు నాని గారు జిలేబి గారిని "sir" అని పిలిచారా ! ? "మేడమ్" అనుకునే వాళ్ళకి షాకిచ్చారుగా మీరు 😀😀.
ReplyDeleteAyyooo naku teliyadu Andi... Kshaminchali
Deleteపాదాలు లేత తమలపాకుల్లా నాజూకుగా ఉన్నాయి. బాపు గారి "పెళ్ళిపుస్తకం" మూవీలో గుర్తుకొస్తోంది.
ReplyDeleteThank you sir
Delete