Monday, March 27, 2017

నీచ బ్రతుకులు..



త్రాగుబోతుల ఇళ్ళల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయో, వారి ఇళ్ళల్లో వారు ఎలా బ్రతుకుతారో చాలామందికి తెలియదు.. మద్యానికి చెల్లించేది వాడి ఒక్కడి జీవితాన్నే కాదు ఓ కుటుంబం మొత్తం.. మైకమనే లోకంలో బ్రతికేటోల్లకు ఇక ఇల్లు, పిల్లలు, సంసారం ఎందుకు.. ఒంటరిగానే చావొచ్చు కదా.. 
మత్తులో శునకాలతో సావాసం ఎందుకు ?? 
వీధుల్లో అర్ధనగ్న విన్యాసాలతో పొర్లు దండాలు ఎందుకు ?? 
లోపం మద్యం దారులలో లేదు.. నీలోనే వుంది.. ఎప్పుడు మారుతావ్ రా.. 
ఏ రోడ్డుప్రక్కన చూసినా నువ్వే.. ఏ వీధి సందుల్లలో చూసినా నీ సీసాలే.. 
మారని ఇలాంటి వారి బ్రతుకుల గురించి ఓ విస్పోటకాస్త్రం ... 

నీచ బ్రతుకులు.. 
*************


అరేయ్ ..
నీకంటే నిర్జీవి నయం ..
నిర్జీవి కంటే నీడ నయం, 
పేడపురుగు నయం,
లేగదూడ నయం,
ఓ త్రాగుబోతూ 
పెళ్ళాన్ని కొట్టి, 
పిల్లల్ని భయపెట్టి, 
పోపుడబ్బాలో దాచిన 
పాల డబ్బులు దోచి, 
ఆ పైకం మైకానికి వెచ్చించి,
కంకర కుప్పలపై చేరి 
వంకరటింకరగా నిదురించే నీ కంటే 
పెరిగిన జఘన కేశాలు నయం
గొరిగిన క్షవరం నయం రా.. 
నాన్నిచ్చిన భూమిని తెగనమ్మి, 
“నాంతాడు”ను తాకట్టు పెట్టి 
వచ్చిన సొమ్ముతో నీవు చేసే ఖర్చు ఏ పాటి ...!!
నీవు త్రాగిన ఖాళీ సీసాలు అమ్మగా 
వచ్చే ఆదాయం ముందు.. ??
పెళ్ళానికి క్షయ, 
పెరిగిన కూతురుకు పరాయివాడి సైటు, 
ఇవేమీ నీకు పట్టవ్ 
చదువు మాని కొడుకు 
కొట్లో గుమస్తాగా గిరి చేసి తెచ్చే సొమ్ము 
వాకిట్లోనే ఎగరేసుకు పోతావ్..!!
ఒంటి పూట తిండికీ, 
గొట్టు కారపు కూటికీ,
అలవాటు పడిన నీ సంసారమే కదూ.. 
నీ అసలు సమస్య...
ఆ సమస్యల నుంచి తప్పించుకోవటానికే కదూ.. 
ఆ చిరాకుల నుంచి దూరంగా పోవటానికే కదూ.. 
నీవు సారా కొట్లో షరాబీగా మారేది ..??
నీ మీద నీకు జాలి కలిగినప్పుడు, 
నీ మీద నీకు కోపం వచ్చినప్పుడు, 
నీకు తీరిగ్గా సేదదీర్చేది ఆ, 
ప్రభుత్వ సారాయి దుకాణమేగా ..!!
అందుకేరా ఓ త్రాగుబోతూ 
అంటున్నాను నేను
నిను, నగ్నంగా నడివీధిలో నిలబెట్టి 
నిలువునా నరికి పారెయ్యాలని..!!!
తప్పేలేదురా..
గొడ్డుబోతు గొడ్లను వధ శాలకు అమ్మినప్పుడు.. 
మోడు బోయిన మానును మొదలకంటా నరికినప్పుడు..
నిను నరకడంలో అనువంతైననూ తప్పులేదురా .. హీనుడా... !!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment