SOCOTRA
మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...
అయ్యో ఇక్కడ వాషర్ లేదా అందుకేనా రాత్రి వర్షానికి ఇక్కడ నీళ్ళు వచ్చి వున్నాయి ... వెంటనే చిన్నోడికి చెప్పి దీన్ని సరి చేయించాలి లేకుంటే వర్షం వస్తే ఇల్లు అంతా వురుస్తూనే వుంటుంది …
అని అనుకోని ఆ కాగితాన్ని తియ్యబోతుండగా ఆ వెలుతురిలో ఇంకుపెన్నుతో రాసిన అక్షరాల వెనుకన కనిపించి, కనిపించని సన్నని అక్షరాలతో యేవో కొన్ని ఇంగ్లిష్ అక్షరాలు వుండటం గమనిస్తాడు ప్రసన్న కుమార్ భాటియా…
అందులో ఏం రాసుందో అని చదువరులు అంతా చాలా ఆతురతతో ఉన్నారని తెలుసు..
ఇక ఆలస్యం ఎందుకు ?? పదండి మరి....!!
3rd Part
ఇదేదో చిత్రంగా వుందే … అని అనుకుంటూ, అక్కడనుంచి ఆ కాగితాలను అన్నిటినీ జాగ్రత్తగా తీసుకొని… హడావిడిగా లోపలకు వెళ్లి ఒక టార్చి లైట్ తీసుకొని ఆ పేపర్ కింద ఈ టార్చి లైట్ ని వుంచి ఆ వెలుగులో కాగితాలు మొత్తం వెతకసాగాడు.. కాని ఎక్కడా ఏమీ కనిపించలేదు.. ఇందాక చూసిన ఆ ఒక్క కాగితంలో మాత్రమే ఏదో వుంది అని నిర్ధారణ చేసుకొని ఆతురతతతో ఆ కాగితాన్ని పరిశీలించసాగాడు..
ఒకే ఒక దగ్గర పెద్ద పెద్ద ఇంగ్లీషు అక్షరాలతో కొన్ని అక్షరాలు కనపడ్డాయి.. అవి ఇలా వున్నాయి “VLSDQAPYLPBPKMD” వాటిని జాగ్రత్తగా ఒక తెల్లని కాగితం మీద రాసుకొని ఇంకా ఏమన్నా వున్నాయేమో అని మళ్ళి సరి చూసుకుంటాడు.. ప్రసన్నకుమార్ భాటియా….
అవితప్ప మరేవీ కనిపించకపోవడంతో ఇక ఆ కాగితంలోని అక్షరాలను చూస్తూ ఆహా ఎంత అద్బుతము 100 సంవత్సరముల క్రితమే …… కాదు, కాదు అలా అయ్యుండదు అని అనుకుంటూ ..
తన గదిలోకి వెళ్లి కొన్ని పుస్తకాలు తీసి వెతుకులాట సాగిస్తాడు.. కొన్ని నిమిషాల తరువాత పురాతన గ్రీకులు మరియు రోమన్లు ఈ “Invisible ink” అదృశ్య సిరాను షుమారు 2,000 సంవత్సరములకు మునుపే రాజనీతి ప్రత్యుత్తరాల కొరకు ఉపయోగించేవారు అని తెలుసుకుంటాడు.. అప్పటిరోజులలో వున్న వారి మేధోసంపత్తికి, అమోఘమైన ముందుచూపుకు ఆశ్చర్యచికితుడై ఆ ఇంగ్లీష్ అక్షరాలగురించి ఆలోచించండం మొదలు పెడతాడు….. ప్రసన్నకుమార్ భాటియా…
ఎన్నో పుస్తకాలు చదువుతాడు. ఎందరినో అడుగుతాడు. కాని ఎవ్వరికీ అర్ధం కాదు… ఇలా కొన్ని రోజులుగా తనలో తనే సతమతమౌతూ వుండగా ఇవన్నీ గమనిస్తున్న వారి ముగ్గురు కుమారులు ప్రసన్న కుమార్ భాటియా దగ్గరకు వచ్చి నాన్న గారు మేము ఒక పొరపాటు చేసాము.. కాని ఆ విషయాన్ని మీదగ్గర దాచాము అనగానే …
ఎంట్రా అది.. మన కుటుంబంలో అలా ఏ విషయాన్ని దాచకూడదు అనే నిభందన తెలుసు కదరా ఎందుకు అలా చేసారు.. అనగానే ..
కదా…
మరి మీరెందుకు మాకు చెప్పకుండా ఆ పిచ్చి పిచ్చి అక్షరాలు గీసుకుంటూ ఆవేదన చెందుతున్నారు..?? మేము అన్నది మీ గురించి నాన్న… మా దగ్గర ఎలాంటి దాపరికాలు లేవు.. మీరు ఇప్పటికైనా అసలు విషయం ఏంటో మాకు చెప్పండి మా వల్ల అయితే మేము చెయ్యగలము.. ఒక్క మస్తిష్కానికి నాలుగు మస్తిష్కాలకు తేడా వుంటుంది కదా.. అని అంటారు ఆ ముగ్గురు పిల్లలు..
నిజమే రా మీరు చెప్పింది..
సరే అయితే ముగ్గురూ వచ్చి ఇలా కూర్చోండి.. అని అంటాడు ప్రసన్న కుమార్ భాటియా…
నలుగురూ గుండ్రని ఆకృతిలో కూర్చుంటారు… మధ్యలో ఆ వీలునామాను, అందులో ఉన్న అదృశ్య అక్షరాలను చూపిస్తూ ఇందులో ఏదో మర్మం దాగుంది రా..
అదేంటో యెంత ప్రయత్నించినా నావల్ల కావట్లేదు..
ఒక విజ్ఞాన శాస్త్ర అధ్యాపకునిగా నేను ఓడిపోయాను.. ఇన్నిరోజులనుంచి కొంచం అంటే కొంచం కూడా తెలుసుకోలేకపోయాను.. మీరు ఇప్పటి పిల్లలు కనుక మీకేమైనా అర్ధం అవుతుందేమో చుడండి. అని చెప్తాడు..
ఆ ముగ్గురు వాటిని ఎన్నోరకాలుగా మార్చి, మార్చి ప్రయత్నిస్తారు.... అలా కొన్ని గంటల సమయం తెలియకుండానే అయిపోతుంది.. ఇది ఒక అసాధారణ తికమక తిరకాసు నాన్న గారు అని నడిపోడు (రెండో వాడు) అనగానే..
నాకు తెలిసి ఇది ఒక కోడింగ్ లా అనిపిస్తుంది.. ఈ కోడింగ్ లో ఒక జాడ మాత్రం వుందని ఖచ్చితంగా అర్ధం అయింది.. దీన్ని కనుగొనాలంటే నా సీనియర్ మ్యాడం ఒకరు వున్నారు ఆమె M.Tech., చదివింది..ఇలాంటి నిఘూడార్ధాలను కనుగొనడమంటే మహా సరదా ఆమెకు.. నేను ఆమెను రేపు మన ఇంటికి ఆహ్వానిస్తాను.. నాకు, నా చదువు పరంగా ఏ సందేహాలు వున్నా ఆమె నివృత్తి పరుస్తారు… అని పెద్దోడు చెప్తాడు..
వెరీగుడ్ రా పెద్దోడా …
ఆమెను సాదరంగా ఆహ్వానించి మన ఇంటికి తీసుకురా… ఈ మర్మం ఎంటో మనం తెలుసుకోవాలి.. అని అంటాడు ప్రసన్న కుమార్ భాటియా…
ఆరోజు మొత్తం ఇదే విషయాలను చర్చించుకుంటూ కాలం గడిపేస్తారు..
సంధ్యాస్తమ సమయం అనంతరం ప్రశాంతమైన ఆ చీకటి రేయిని ఆస్వాదిస్తూ ఆరుబయటి వెన్నెల, తారాజువ్వల మిలుగు, మిలుగు వెలుగులలో, నలుగురూ వెల్లకిలా పడుకొని, శిరస్సు కింద చేతులు పెట్టుకొని ఈ ప్రపంచంలో మేము నలుగురమే మగ మహారాజులం అని ధీటైన ఓకింత గర్వముతో చల్లని పిల్లగాలి పారవశ్యముతో మెల్లిగా నిద్రలోకి జారుకుంటారు ఆ నలుగురూ..
సూర్యభగవానుడు రాకమునుపే ముందుగానే మేల్కుంటారు నలుగురూ.. వంటా, వార్పూ అన్నీ పనులు ఎవరివి వారు చకా చకా చేసుకుంటూ ...ఆ రాబోయే మ్యాడం గారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటానికి సన్నాహాలు సిద్దం చేస్తారు… అప్పటికే సమయం పది కావస్తుండటంతో పెద్దోడు ఆ మ్యాడం దగ్గరకు బయలుదేరాడు …
“వరద భాదితులు పులిహోర పోట్లాలకై ఎదురు చూసే చూపులు” మాదిర ప్రస్తుతం ఆ ముగ్గురూ వేచివున్నారు .. కొన్ని గంటల నిరీక్షణ అనంతరం ఆ మ్యాడం గారు రానే వచ్చారు.. వచ్చీ రాగానే నమస్కారం ప్రసన్న కుమార్ భాటియాగారు … అంటూ స్వచ్చమైన చిరుమంద హాసముతో మనస్పూర్తిగా పలకరిస్తూ వస్తారు…
నమస్కారం అమ్మా అంటూ కూర్చోమని అబ్యర్ధిస్తాడు …
అందరూ కూర్చుని జరిగిన విషయాన్ని మొత్తం ఆమెకు వివరిస్తారు…
ఆమె ఆ రహస్య అక్షరాలను కాసేపు అలా తేరిపారా చూడగానే .. అవును మీరు చెప్పింది నిజమే ఇదొక రహస్య కోడింగ్ .. అని అంటుంది..
అమ్మా మాకు అర్ధం కాలేదు కొంచం వివరణ ఇవ్వగలరా ??
అని ప్రసన్న కుమార్ భాటియా అడగగా..
తప్పకుండా అండి అంటూ … ఈ వీలునామాలో మీకు కనిపిస్తున్న ఈ అదృశ్య అక్షరాలు ఒక కోడింగ్ లాంటివి….
అయితే ఇలా కోడింగ్ తో రాయాల్సిన అవసరం ఏముంది ? అని ప్రసన్న కుమార్ భాటియా ప్రశ్నించగా..
ఇలాంటి కోడింగ్స్ విలువైన, అపారమైన వాటికే ఉపయోగిస్తారు … ఎందుకంటె ఈ కోడింగ్ ఆధారంగానే మనం ముందుకు వెళ్ళగలం…
విలువైన, అపారమైన అంటే ?? మీ దృష్టిలో యేమని అర్ధం అండి అని ప్రసన్న కుమార్ భాటియా మళ్ళి ప్రశ్నిస్తాడు..
ఏదైనా వస్తువు కావచ్చు, మరేదైనా రహస్య విషయం కావచ్చు లేకపోతే అపారమైన నిధి కావచ్చు అని సమాధానమిస్తుంది …
“ నిధా “ అనగానే
మీరు అలా ఒక నిర్ణయానికి అప్పుడే రాకండి.. నాకూ ఇంకా తెలియదు..
అయితే అమ్మా .. మీరు ఆ కోడింగ్ ని కనిపెట్ట గలరా.. ??
అసలు ఇదేం కోడింగ్ నేను ఓ విజ్ఞానశాస్త్ర అధ్యాపకుడను… అయిననూ నాకేమి అర్ధం కాలేదు.. అసలు ఏంటి ఈ కోడింగ్ అని అడుగగా..
ప్రసన్న కుమార్ భాటియా గారు ఇది ఒక అసాధారణమైన శాస్త్రం ..
దీని పేరు క్రిప్టోగ్రఫీ (గూఢలిపి శాస్త్రం) ..అని అనుకుంటూ వున్నాను.. అప్పుడే ఏవిషయం చెప్పలేను..
ఓ అవునా .. నేనెప్పుడూ ఈ పదాన్ని వినలేదు అమ్మా అని అనగానే..
దీనిగురించి చాలామందికి తెలియకపోవచ్చు. క్రిప్టోగ్రఫీ (గూఢలిపి శాస్త్రం) గురించి నాకు తెలిసి చాలా తక్కువమందికే తెలిసి వుంటుంది ,.. ఒకవేళ తెలిసున్నా ఎలా చెయ్యాలో అవగాహన ఉండకపోవచ్చు ...కాని మీరు దిగులు చెందకండి ఇది కనుక నిజంగా క్రిప్టోగ్రఫీ (గూఢలిపి శాస్త్రం) అయివుంటే మాత్రం ఈ రహస్యాన్ని నేను తప్పక చేధించగలను..
మీ తాతయ్య గారు ఈ ఇంగ్లీషు కోడింగ్ తో పాటే .. మరోటి కూడా ఏదో వదిలి వుంటారు ఇందులో …..
అదేంటో నేను వెతకాలి..
నన్ను ఒంటరిగా కొన్ని గంటలు వదిలేయండి.. నేను దీన్ని కనుగొనే ప్రయత్నం చేస్తాను... అని ఆమె చెప్పగానే ..
తప్పకుండా అమ్మా అంటూ అందరూ లేచి … బయటకి వెళ్లి కూర్చుంటారు…
కొన్ని గంటల సమయం అనంతరం లోపలనుంచి….
“ప్రసన్న కుమార్ భాటియా గారు” అంటూ ఆమె సన్నని స్వరం వినిపించగానే పరుగులుతీస్తూ అందరూ లోపలకు వెళ్తారు…
ఏమ్మా అర్ధం తెలిసిందా ?? అని ఆతురతతతో ప్రసన్న కుమార్ భాటియా గారు అడుగగా ..
To be continued …
Written by : BOBBY
yentidhi aha yentidheeeee antaaaa,,,ee tension tho prasanna ki yemo kaani naaku maathram BP vachi padipoyelaa vunna..good Bobby,,full of interesting..Keep it up.
ReplyDeletehahahaha thank u very much bro..
Deleteintresting next anti bobby garu
ReplyDeleteFriday chepthaanu mam ..
Deleteచాలా బాగా వ్రాస్తున్నారు బాబీ.. ఇది ఖచ్చితంగా స్వాతి లాంటి మేగజైన్ కు సీరియల్ గా పంపించతగిన నాణ్యతతో వ్రాస్తున్నారు.. మీ శైలి కూడ బావుంది..
ReplyDeleteThank u bro..
Deleteమీ ఈ బ్లాగును అగ్రిగేటర్స్ కు జత చేయండి.. క్రింద లింకులను ఉంచుతున్నాను...
ReplyDeletehttp://www.sodhini.com/add-blog/
http://forum.blogadda.com/
thank u for u'r support bro..
DeleteChala bagundi bro......interesting....
ReplyDeleteThank u andi .. remaining parts kooda chadivi mee abhiprayalu cheppagalarani aasisthunnanu ..
DeleteInteresting and Nice One Bobby gaaru, waiting for the next part.
ReplyDeletethank u soo much sir..
DeleteVery interesting nani....
ReplyDelete