SOCOTRA
-The Mysterious Island-
మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...
నా కుమారులు ముగ్గురూ ఈ మధ్యనే మైనర్లు తీరి మేజర్లు అయినారు కనుక ఆ వీలునామాలో ఏం రాసుందో తెలుసుకునే సమయం ప్రస్తుతం ఆసన్నమైనది.. అది రేపే అని చాలా కుతూహలంగా వుంది.. ఇవే ఆలోచనలతో ఆ రాత్రి మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ప్రసన్న కుమార్ భాటియా…
ఇంతకీ ఆ వీలునామాలో ఏం రాసుంది ??
తెలుసుకుందాం పదండి మరి.. !
2nd Part
పడక దిగీ దిగగానే హడావిడిగా తయారయ్యి, అనుకున్న సమయానికి ఆ లాయర్ గారి దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు ప్రసన్నకుమార్ భాటియా ..
అప్పటికే అక్కడ చాలా మంది ఉండటంతో అది చూసి …పొద్దు పొద్దుగాలే వీళ్ళకు పని, పాటా ఏమీ ఉండదా.. ఏంటీ ? ఇంత పొద్దుగాల్నే తగలడ్డారు అందరూ !!! .. అని మనసులో అనుకుంటూ, ఒకపక్కన వెళ్లి కూర్చుంటాడు..
ఆ జనాలను చూసి చిరాకులో వున్న ప్రసన్న కుమార్ భాటియా వద్దకు ఒక చిన్న పిల్లవాడు దగ్గరగా వచ్చి పక్కన కూర్చుంటాడు…
ఆ పిల్లాడిని చూస్తూ పలకరించగా వాడు మొహం తిప్పుకొని చరవాణిలో పాటలు పెట్టుకొని అందరికీ వినిపించేలా వింటూ ఉన్నాడు....
ఓరి భడవ…! ఇంత లేవు నీకు ఇంత పొగరా అని అంటూ…. వాడి చరవాణిలో వస్తున్న ఎఫ్.ఏం. రేడియో లోని పాటలు ఇతను కూడా విన సాగాడు.. అలా వింటూ వుండగా..
“సాగర సంగమం” నుంచి ఒక పాట అని ఆ చరవాణి లో వినిపిస్తుంది..
అబ్బా … అందులో అన్నీ పాటలు ఆణిముత్యాలే అని మనసులో అనుకుంటూ ఉండగానే ..
ఓం... ఓం... ఓం
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
చంద్ర కళాధర సహ్రుదయా..
చంద్ర కళాధర సహ్రుదయా...
సాంద్రకళా పూర్ణోదయా లయ నిలయా..
ఓం... ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ...
పంచభూతములు ముఖపంచకమై...
ఆరు ఋతువులూ ఆహార్యములై…
అని అంటున్నలోపే దూరం నుంచి “ప్రసన్న కుమార్ భాటియా” అనే పిలుపు వినపడుతుంది..
ఆ నేనే అంటూ లోపలి వెళ్తాడు…
అక్కడ లాయర్ గారు (ఇలా అడుగుతూ) మీ పిల్లల జనన ధృవీకరణ పత్రములు చూపించండి …. అలాగే మీ తాత గారి మరణ దృవీకరణ పత్రము కూడా చూపించండి అని అడిగి … యేవో కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తరువాత ఆ సీల్డు కవర్ వీలునామాను బయటికి తీసాడు.. వందేళ్ళు చరిత్ర వున్న ఆ వీలునామాలో ఏం రాసుందో అని నాలో కుతూహలం క్షణ క్షణానికీ తారాస్థాయికి వెళ్తోంది..
చూడండి ప్రసన్న కుమార్ భాటియా గారు …
మీ పేరు అదే కదా అంటూ గరుకైన స్వరంతో ప్రశ్నిస్తాడు ఆ లాయర్ గారు..
అవును సర్ చెప్పండి అని బదులు సమాధానం చెప్తాడు ..
ఈ సీల్డు కవర్ వీలునామాను మొదట మేము చదివిన తరువాత మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు మీరు సమ్మతిస్తున్నారా ? అని ఆ లాయర్ గారు అడుగుతారు..
అలాగే సర్ మీరు చదివి వినిపించండి అని అంటాడు. హా అంటూ తల ఊపుతూ ఒక టేప్ రికార్డు తీసుకొని రికార్డింగ్ బటన్ నొక్కి చదవడం మొదలు పెట్టాడు ఆ లాయర్ గారు..
వీలునామా
********
చిన్మయానంద్ భాటియా అను నేను మనఃపూర్వకముగానూ, స్వబుద్దిపూర్వకముగానూ, స్వచిత్తముతోనూ, ఎవరి ప్రోద్బలం లేకుండా, ఈ మానవ జీవితం అశాశ్వతములు అయినందుచేత, దేహ ధర్మములు, దైవిక రాజీయములు ఎప్పటికేవిధముగా పరిణమించునో అని అనుమానము నాకు గోచరించి, నా జీవిత కాలములోపలనే నాకు వుండుకున్న యావత్తు స్థిర, చర ఆస్తులను నా తదనంతరం ఎవరికి చెందాలో వారికి చెందులాగున తగువైన ఏర్పాట్లు చెయ్యదలచి ఈ వీలు నామా వ్రాయించడమైనది..
నాకు ఇప్పటికి షుమారు 80 సంవత్సరములు పైబడినవి… అంటూ మొత్తం వీలునామాను చదివి వినిపిస్తాడు.. చివరన “Any assets, movable or immovable, Silver, Gold and etc., from being mentioned in this will or which may hereafter be acquired by me shall be taken by my grandson and their legal heirs aforesaid in equal shares absolutely” అనే విషయన్ని చదువుతాడు ఆ లాయర్..
ఇదంతా వింటున్న ప్రసన్న కుమార్ భాటియా ..సర్ ఒక్క నిమిషం ….
ఇంత విషయాన్ని తెలుగులో రాసి ఈ మూడు పంక్తులను ఇంగ్లీష్ లో రాయడం ఎందుకు ?
అని ప్రశ్నిస్తాడు ..
అప్పట్లో బ్రిటీష్ వారు వారి యొక్క ఆంగ్ల భాషాధిక్యాన్ని ప్రదర్శించడానికి రాసిన రాతకోతలు లేండి అవి.. ఏదైనా ఒకటే అర్ధం కదా !
అంటూ … ఆ వీలునామాను కవర్ లో పెట్టి తన చేతికి ఇచ్చేస్తాడు ఆ లాయర్..
ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచనలతో సతమతమౌతూ ఉంటాడు ప్రసన్న కుమార్ భాటియా… ఈలోపలే ముగ్గురు పిల్లలు ఇంటికి వస్తారు..
నాన్న గారు...., వెళ్ళిన పని ఏమైంది ?
అంటూ ముగ్గురూ వచ్చి పక్కన కూర్చుంటారు..
అయింది రా…
కాని నాలో ఏదో తెలియని ఆలోచనలు నన్ను దీర్ఘంగా వెంటాడుతూ వున్నాయి రా...
బహుశా నిన్న రాత్రి వర్షం లో తడిచిన కారణం ఏమో…. ఒంట్లో ఒకటే నలతగా వుంది. కాసేపు పడుకుంటాను. అంటూ మంచం మీదకు వెళ్లి పడుకుంటాడు ప్రసన్న కుమార్ భాటియా…
మనిషి అయితే ఇక్కడ వున్నాడు కాని మనసు మాత్రం ఆ వీలునామా మీదనే వుంది.. అందుకు గల కారణం అప్పటి రోజులలో వారి తాతగారు ఏ విషయాన్ని అయినా తిన్నగా చెప్పేవారు కాదట .. ఏదో ఒక తిరకాసు పెట్టి ఎవరికీ అర్ధం కాని విధంగా రాసేవారు అని ప్రసన్న కుమార్ భాటియా గారి తండ్రి గారు చెప్పేవారు.. అందువల్ల ఈ వీలునామాలో మాకు కల్పించింది స్వల్ప ఆస్తి .. అయినప్పటికినీ ఇంత రహస్యంగా సీల్డ్ కవర్ వీలు నామా రాయాల్సిన అవసరం ఏముంది.. ??
ఇది నా మొదటి సందేహం…
ఇకపోతే మొత్తం అంతా తెలుగులో రాసి కింద మూడు పంక్తులు ఇంగ్లీష్ లో రాయడం వెనుకున్న ఆంతర్యం ఏంటి ??
ఇది నా రెండవ సందేహం …
అని అలానే పడుకొని ఆలోచిస్తూ వున్నాడు ప్రసన్న కుమార్ భాటియా…
ఇలా కాదు అంటూ చటుక్కున పైకి లేచి నిలబడి బీరువాలో ఉంచిన ఆ వీలునామాను బయటికి తీసి మరలా దాన్నిమొదటి పంక్తి నుంచి క్షుణ్ణంగా అక్షరం, అక్షరం పరీక్షించసాగాడు.. అయినా ఏమీ భోదపడలేదు.. మళ్ళి మళ్ళి అలా చదువుతూనే వున్నాడు.. అలా ఎన్నో సార్లు చదివినప్పటికీ ప్రయోజనం కనిపించదు.. ఇక విసుగు చెంది….
“రాసినోడు ఒక తింగరోడు” … “దాన్ని అపురూపంగా చదివేవాడొక సన్నాసోడు”...
అని తిట్టుకుంటూ దాన్ని పక్కన పెట్టేసి అలా నిద్రలోకి జారుకుంటాడు.. ప్రసన్నకుమార్ భాటియా ..
కొంచం సమయం తరువాత ఆ వీలునామా కాగితములు గాలికి ఎగురుతూ వెళ్తున్నాయి.. ఆ కాగితపు శబ్దానికి మెలుకువ వచ్చిన ప్రసన్న కుమార్ భాటియా తేరుకొని వెంటనే ఆ కాగితాల వెంట పరుగులు తీస్తాడు..
ఆ కాగితాలు ఒక్కొక్కటిగా తీయబోతుండగా మిట్ట మధ్యాహ్న సమయం కావడంచేత, పైన రేకుల కప్పులో.. ఇనుప చువ్వకు రేకుకు మధ్య కలిసి ఉండాల్సిన ఒక వాషరు వూడివుండటం చేత ఆ సన్నని రంధ్రం నుంచి నడినెత్తిన వున్న భానుడి కిరణాలు ప్రసరించి ఆ వీలునామాలోని ఒక కాగితం మీద ఎక్కువ వెలుగుతో కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతితో ప్రసరించడం చూస్తాడు.. ప్రసన్నకుమార్ భాటియా..
అయ్యో ఇక్కడ వాషర్ లేదా అందుకేనా రాత్రి వర్షానికి ఇక్కడ నీళ్ళు వచ్చి వున్నాయి ... వెంటనే చిన్నోడికి చెప్పి దీన్ని సరి చేయించాలి లేకుంటే వర్షం వస్తే ఇల్లు అంతా వురుస్తూనే వుంటుంది …
అని అనుకోని ఆ కాగితాన్ని తియ్యబోతుండగా ఆ వెలుతురిలో ఇంకుపెన్నుతో రాసిన అక్షరాల వెనుకన కనిపించి, కనిపించని సన్నని అక్షరాలతో యేవో కొన్ని ఇంగ్లిష్ అక్షరాలు వుండటం గమనిస్తాడు ప్రసన్న కుమార్ భాటియా…
To be continued …
Written by : BOBBY
kanipinchina moodu mukkala ENGLISH padhaalake inthalaa visugu chendhaadu papam..inka athi chinna padhaalu chadivithe inkem ipothaado Bobby..anyhow manchi suspence lo pettaaav..maanchi interest gaa vundhi..
ReplyDeletethank u bro..
DeleteThrilling ga undi bro... waiting for next part
ReplyDeleteThank u soo much bro.. repu post chesthaanu
Deletess really thrilling bobby garu waiting next amavutundoo daniloo ami rasundoo ani
ReplyDeletethank u mam .... repu tappaka meeku telustundi
Deleteసూపర్ బ్రదర్... వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్
ReplyDelete