Friday, October 30, 2020

నాటకం..



జీవం లేని
పీనుగు ముఖాలవంటి
ఈ అవర్ణపు లోకంలో నీ
మనుగడ ఓ ప్రస్నార్ధకమే..!!
అంతటా నాటకమే మరి
నీకు తెలియకుండా
నువ్వాడే నీ బ్రతుకే ఓ నాటకం
రంగులు పులుముకుని రోజుకో వేషం
నవ్విస్తావ్,
ఏడిపిస్తావ్,
నమ్మిస్తూ మోసంచేస్తావ్
పడక దిగినది మొదలు
పడక చేరేదాకా బ్రతుకు పాత్రలో
అలరిస్తావ్, మురిపిస్తావ్, మైమరిపిస్తావ్
పగలూ, రేయీ నడుమన
పడుతూ, లేస్తూ సాగే ఓ
అద్బుత కథలోని మహా నటులం..!!
కష్టాలు, కన్నీళ్ళు,
ప్రేమలు, స్నేహ బంధాల
చిక్కుముడులతో రాసిన
అద్భుత కథలోని నటీ నటులం
ఎవరి బ్రతుకూ వ్యర్ధం కాదోయ్..!
ప్రతీ పాత్రదీ ఓ సముచిత స్థానం..!!
ఇన్ని చేసేవాడివి
బాధతో, నిస్సహాయంగా
ఎందుకు ఉన్నచోటే ఉన్నావ్ ?
కదిలే కాలమూ,
ఎగసే కెరటమూ,
ఉదయించే కిరణమూ,
ఎప్పుడైనా విశ్రాంతి
తీసుకోవడం చూసావా ?
లే..
కదులు..
గర్జించే సంద్రం వలె
ఉరిమే ఆకాశం వలె..!!
ముసలితనం నీకే
నీ అక్షరానికి కాదు..
చావు
ఏ క్షణాన ఎదురుపడినా
ఒక మారు సంతోషంగా
కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశమివ్వు..!!
అదే జీవితం..!!

Written by: Bobby Nani

No comments:

Post a Comment